Thursday, January 16, 2014

Sri Suvarcalanjaneya swami Temple, శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం-వుయ్యూరు గ్రామం(కృష్ణ జిల్లా)




దేవాలయ చరిత్ర : సాధారణం గా ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తాన్జనేయం గానో దాసాన్జనేయం గానో వీరాన్జనేయం గానో ఎక్కువగా వుంటాయి
సువర్చల తో కూడిన ఆంజనేయ దేవాలయాలు చాలా అరుదు .అలాంటి అరుదైన శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణ జిల్లలో వుయ్యూరు మండలం లోని వుయ్యూరు గ్రామం లో రావిచెట్టు బజారు చివర పుల్లేరు కాలువకు సమీపం లో వుంది
అది గబ్బిట వారి దేవాలయం గా ప్రసిధి చెందింది
ఆ ఆలయాన్ని మా తండ్రి గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి మాతా మహులు ఆంటే మా నాయనమ్మ నాగమ్మ గారి తండ్రి గారు గుండు లక్ష్మీ నరసిమ్హావధానులు గారు సుమారు రెండు వందల సంవత్చరాల క్రితం స్వంత ఖర్చులతో ఆ దేవాలయాన్ని నిర్మించి ,ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేసారు .వుత్శవ మూర్తులను కూడా ఏర్పాటు చేసి ధ్వజ స్థంభ ప్రతిష్ట చేసారు
.వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం నాడు శ్రీ హనుమజ్జయంతిని సువర్చలాన్జనేయ కల్యాణాన్ని చాల వైభవం గా జరిపే వారట .కోరిన కోరికలను తీర్చే దైవం స్వామి అందరికి అండగా వుండేవారు ఆవరణ లో ఈశాన్య భాగాన ఎత్తైన కళ్యాణ మండపం వుండేది .అర్చక స్వాములు శ్రద్ధగా స్వామి సేవ చేస్తూ తరించేవారు .నరసిమ్హావదానుల మరణం తర్వాత వారి దౌహిత్రుడి గా మా నాన్న గారు  వంశ పారంపర్య ధర్మ కర్తగా వున్నారు ..కార్యక్రమాలన్నీ బాగానే జరిగేవి
ఆలయం బాగా ముందుకు వుండటం వ్వేనుక ఖాళీ ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ మంది కి దర్శన భాగ్యం కష్టం గా వుండేది .కళ్యాణం ,జయంతి తప్పక జరిగేవి .రోడ్డు ఎట్టు పెరగటం ఆలయం లోతుగా వుండటం వల్ల వర్షా కాలమ్ నీరంతా లోపలి చేరి చాల ఇబ్బందిగా వుండేది
1961 లో మా తండ్రి గారి నిర్యాణం తరువాత నేను వంశ పారంపర్య ధర్మ కర్త  గా ఉంటున్నాను .ఆలయం శిధిలమై పోతోంది ,ఇరుకు గా కూడా వుండటం కూడా బాధాకరం గా వుండేది ఎన్నో సార్లు మంచి ఆలయాన్ని అక్కడే నిర్మించాలని అనుకున్నాము మా ఒక్కరి వల్ల ఆయె పనికాదు అందరి సహకారం కావాలి ప్రయత్నం చేసాం ..కని స్వామి అనుగ్రహం లేనిది ఏపనీ కాదు
                       ఇంతలో ఆ రోడ్ చివర వంతెన నిర్మాణం అయింది .అప్పుడు మకుటుంబ,సభ్యులకు శ్రేయోభిలాషులకు గ్రామస్తులకు బలీయమైన ఆలోచనా కలిగి స్వామి ఆశీర్వాదబలం తోడై ఒక కమిటీ గా ఏర్పడి ఆలయ నిర్మాణం చేయాలని ద్రుఢమైన సంకల్పం కలిగింది .వరుసగా సమావేశాలు జరపటం చందాలు వసూలు చేయటం వసూలైన ధనాన్ని బ్యాంకు లో వేయటం రసీదులు ఇవ్వటం చేసాము .దీనికి నాకు పూర్తి సహకారాన్ని అందించిన వారు స్వర్గీయ మండా వీరభద్ర రావు ,సంజీవరావు ,.కాలికి బలపం కట్టుకొని మేము ముగ్గురం తిరిగాము ,.మంచి సహకారం లభించింది .ధనం పోగాయింది స్వచ్చందం గా ముందుకు వచ్చి ధనం అందించారు
శ్రీ సుబ్బారావు గారు నిర్మాణ పర్య వేక్షణ చేసారు .స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్చర నిజ జ్యేష్ట నవమీ గురూ వారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరామః యందు అనగా 23 -06 -1988  న స్వామి వారి పునః ప్రతిష్ట కార్యక్రమం వైఖానస ఆగమ విధానం లో శ్రీ వేదాంతం శ్రీ రామా చార్యుల వారి ఆధ్వర్యం లో నేను నా భార్య ప్రభావతి దంపతులం స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట చేసాము
.ఆ నాటి కే.సి పీ ప్లాంట్ మేనేజర్ స్వర్గీయ ఇంజేటి జగన్నాధరావు గారు శాసన సభ్యులు స్వర్గీయ అన్నే బాబూరావు గారు ముఖ్యులుగా విచ్చేసి కార్యక్రమానికి ఘనత చేకూర్చారు కే.సి పీ వారి వదాన్యత వుయ్యూరు ,చుట్టుపక్కల గ్రామస్తుల దాతృత్వం సహాయం మరువలేము పువ్వాడ వారు వెంట్రాప్రగడ వారు ఊర వారు చోడవరపు వారు మండా వారు ఒకరేమిటి అందరు పెద్ద మనసు తో ఈ పవిత్ర భగవత్ కార్యానికి  సహకరించారు వుత్శవ విగ్రహాలు తో ఆలయం శోభిల్లింది ఉచితం గా ఇసుక తోలారు కొందరు సిమెంట్ ,ఇచ్చారు కొందరు    స్వామి మీద వున్న అచంచల విశ్వాసమేఇంత  పని మా అందరితో చేయించింది .మా కుటుంబ సభ్యులు ధనం తో సేవతో సహకరించారు ..అదొక పండగ గా జరిగింది
                         ఇంత వున్న ధన లోపం వల్ల ధ్వజ స్థంభ నిర్మాణం చేయ లేక పోయాం .అయితె ప్రతి సంవత్షరం హనుమజ్జయంతిని వైభవోపేతం గా చేసి స్వామి వారి కళ్యాణం చేస్తూ తరించాము .భక్తులు పెరిగారు .ధనుర్మాస కార్య క్రమాలు ప్రారంభించాము .హనుమద్వ్రతం ప్రతి సంవత్చరం జరుపుతున్నాం. .చైనా వోగిరాల వాస్తవ్యులు ,వదాన్యులు స్వర్గీయ పాలడుగు నాగేశ్వర దాసు గారు ధ్వజస్తంభాన్ని ప్రదానం చేసారు స్వస్తీస్రే చాంద్రమాన శ్రీ ముఖ నామ సంవత్చర జ్యేష్ట బహుళ నవమి 13 -06 -93 ఆదివారం ఉదయం 07 -29  గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున ల్లగ్న పుష్కరాసము లో ధ్వజ ప్రతిష్టా మహోత్స్చావం అత్యంత వైభవం గా జరిగింది .శ్రీ దొడ్డ వెంకట రత్నం దంపతులు శ్రీ పరాశరం రామ కృష్ణ మాచార్యుల వారి ఆధ్వర్యం లో ధ్వజ ప్రతిష్ట జరిపారు .ఎందరో వదాన్యులు సహకరించారు .ఇత్తడి తొడుగు కూడా వేయించాము. మండా వీరభద్ర రావు సంజీవ రావు గారల,అవిశ్రాంత కృషి  అనుక్షణ పర్యవేక్షణ నాకు కొండంత బలం .వారి సేవలు మరువ లేనివి .
                             నిత్యం వందలాది భక్తులు శ్రీ సువర్చలన్జనేయ స్వామి వార్లను సేవించి తరిస్తున్నారు తమల పాకుల పూజ ,పండ్లతో పూజ గంధ శింధురం తో అర్చనా విసేసం గా జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు వేలాది మంది ప్రదఖినలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి .భోగి నాడు శాంతి కల్యాణం జరుగుతుంది ఊరేగింపు చేస్తాము ఒంటె వాహనం మీద .లాడ్డులతో ప్రత్యెక పూజ కాయ గురాలతో విశేష అర్చన చూడ ముచ్చటగా వుంటుంది భజనలు హనుమాన్ చాలీసా పారాయణ ,విష్ణు ,లలితా పారాయణ సాముహిక కుంకుమ పూజ యే ఆలయం ప్రత్యేకత మాన్యు సూక్తం తో స్వామి వారికి అభిషేకం జరుగ్గుతుంది
                                మూడు సంవత్శరాల క్రితం పదకొండు రోజులు ప్రత్యెక కార్యక్రమం నిర్వహించాము,ఆలయం పునర్నిర్మించి ఇరవై ఏళ్ళు అవుతున్న సందర్భం గా .ప్రతిరోజూ ఉదయం మన్యుసుక్తంతో స్వామి వారికి అభిషేకం హోమం సహస్రనామార్చన సాయంత్రం మళ్ళీ హోమంశాంతి   కల్యాణం ..అపూర్వ స్పందన లభించింది శ్రీ స్వర్ణ నాగేశ్వర రావు గారి నేతృత్వం లో ,ఏలూరు వెద పండిట్ల ఆధ్వర్యం లో మహత్తరం గా పదకొండు రోజుల కార్య క్రమాలు జరిగాయి .మంచి సహకారం లభించింది రోజు మా దంపతుల తో పాటు ఒకరిద్దరు దంపతులు కుర్చుని స్వామి వార్ల కల్యాణం చేయటటం మహద్భాగ్యం గా భక్తులు భావించారు ఆలయం లో భక్తులు అన్ని సౌకర్యాలు కల్గించా టానికి సహకరిస్తున్నారు
                         ఈ విధం గా వుయ్యూరు లోని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ధర్మ కర్తగా స్వామి సేవలో నా జీవితాన్ని పండించుకుంటున్నాను .
                       27 -05 -11  న వైశాఖ బహుళ దశమి శుక్రవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు స్వామి వార్ల కృపా కటాక్ష ప్రాప్తి రస్తు
                                                  సర్వ్ జనః సుఖినో భవంతు .విశ్వ శాంతి రస్తు .లోక కళ్యాణ మస్తు .


Courtesy with :                                                                      మీ
                                                            గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలయ జీర్ణోద్ధరణ
————-
ధర్మ కర్త   –శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం –వుయ్యూరు

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment