Sunday, January 12, 2014

Second Annavaram Gudem Temmple(Adilabad dist),రెండవ అన్నవం-గూడెం దేవస్థానం(అదిలాబాద్‌ జిల్లా)
-ఏ శుభకార్యం జరిగినా మనవారు సత్యనారాయ స్వామి వ్రతం చేసుకుంటారు. అంతటి మహిమాన్వితుడైన దైవం సత్యనారాయణ స్వామి. ఆ స్వామి సర్వాంతర్యామి. గుడిలో ఉన్న ఆ స్వామి మన కంటిని కోవెలాగా చేసుకుని కూడా దివ్యదర్శనమిస్తాడు. గూడెం గ్రామంలో ఒక సామాన్యుడికి కలలో దర్శనమిచ్చాడు. తన కోవెల నిర్మాణానికి తానే దారి చూపాడా స్వామి. అదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం, గూడెం గ్రామంలో వెలసిన సత్యనారాయణ స్వామి దేవస్థానం రెండవ అన్నవరంగా ప్రసిద్ధిగాంచింది.

ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం, గూడెం గ్రామంలోని సత్యనారాయణ స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే రెండో అన్నవ రంగాపసిద్ది గాంచింది. దేవస్థానానికి సమీపం లోనే గోదావరి ప్రవహిస్తుండడంతో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి సత్యనారా యణస్వామి దర్శనం చేసుకుని తమ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతినెలా పౌర్ణ మి రోజున వేలాది మంది భక్తుల మధ్య గొప్ప జాతర జరుగుతుందక్కడ. రాష్ట్రం నలుమూల ల నుండి భక్తులు తరలివచ్చి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి స్వామి వారిని దర్శనం చేసుకోవడం పరిపాటి. రాష్ట్రంలోనే ప్రసిద్ది చెందిన సత్యనారాయణస్వామి దేవ స్థానాల్లో మొదటిది తూర్పు గోదావరి జిల్లాలో ని అన్నవరం కాగా, మరో అన్నవరంగా గూ డెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి నదీ తీరాన ఎతె్తైన గుట్ట పై వెలసిన సత్యసంకల్పుడు, వైకుంఠరాముడు అయిన శ్రీ సత్యనారాయణ స్వామిని గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్ల స్వామి ప్రతిష్ఠిం చారు. తెలంగాణలోనే ఎంతో ప్రసిద్దిగాంచిన ఈ సత్యనారాయణ స్వామి దేవ స్థానానికి ప్రతిదినం ఎందరో భక్తులు వస్తుంటారు.

క్షేత్ర మహత్మ్యం...
god338 సంవత్సరాలకు పూర్వం గూడెం గ్రామ వాసులైన గోవర్ధన పెరుమాండ్ల స్వామి అను చాత్తాద శ్రీవైష్ణవునికి శ్రీస్వామి వారు కలలో కనిపించి నేను మీ గ్రామ శివారు రాట్నపు చెవుల కొండపై వెలిశాను అని సెలవిచ్చా రట. నాకు వచ్చింది కలనేకదా అని భక్తుడైన పెరుమాండ్ల స్వామి ఆ మాటను నమ్మలేదు. కాని మళ్లీ మరుసటి రోజు స్వామి వారు కలలోకి రావటం వల్ల ఆశ్చర్యపోయిన పెరుమాండ్లు కొండపైన స్వామి వెలసిన చోటు కోసం వెతకటం ప్రారంభించాడు. ఎంత వెతికినా జాడ దొరక్క పోవడం వల్ల సాయంత్రం ఇంటికి వెళ్ళి నిద్రపోయే ముందు నీవు ఉండే జాడ తెలుసు కునేంత ఙ్ఞానం నాకు ఎక్కడుంది. స్వామి? నన్ను మన్నించి దర్శనమివ్వమని మనస్సులో తలచుకొని పడుకున్నాడు. మళ్ళీ ఆ రోజు స్వామి వారు కలలోకి వచ్చి మీకు ఎదురుగా కనబడుతున్న ఎతె్తైన కొండపై ఉన్న గుహల్లో నేను ఉన్నాను... అని చెప్పి అదృశ్యమయ్యారు.

-తెల్లవారగానే సంతోషం పట్టజాలక పెరు మాండ్ల స్వామి గుట్టపైకి ఎక్కి కలలో కనిపిం చిన గుహలో వెదికాడు. అప్పుడు గుహ లో చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహాన్ని ముట్టుకోకుండా ఇంటికి చేరుకున్నాడు. భక్తితో పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించిన పెరుమాండ్లు స్వామి వారి విగ్రహానికి అభిషేకాలు, పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలు తండోపతండా లుగా గుట్టపైకి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నా రు. కొన్ని రోజుల తరువాత పెరుమాండ్ల స్వామి ఆలో చించి శ్రీసత్య నారాయణ స్వామి, రమాదేవి (లక్ష్మీ) విగ్రహాలను పెద్దవి చేయించి సొంత నిధులతో ఆలయ నిర్మాణం గావించి శ్రీ క్రోధి నామ సంత్సర మాఘశుద్ధ దశమి (1964వ సంవత్సరం) నాడు విగ్రహ ప్రతిష్టాపన చేశాడు.

- గుట్టపైకి వెళ్ళేందుకు దారి, మంచి నీటి బావి తవ్వించి ఆలయానికి కొత్త శోభను చేకూర్చారు. అప్పటి నుండి అనునిత్యం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానం వినూత్న కళతో వెలుగొందుతోంది. ఒక్క తెలంగాణా లోనే కాక రాష్ట్రంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కుంకు మార్చనలు, అభిషేకం, అష్టోత్తర పూజ, హార తులు, నవగ్రహ, సహస్రనామ నిత్యాది అర్చ నలు, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహి స్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ద్వాదశి రోజున శ్రీస్వామి వారి కళ్యాణోత్సవం, హోమం, రథోత్సవం నిర్వహిస్తారు. సప్తహాభజనల రోజున గొప్ప జాతర, హోమ యఙ్ఞం జరుగుతాయి. ఈ దేవాలయం దేవాదాయశాఖ ఆధీనంలో ఉండటం వల్ల భక్తుల సౌఖర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పౌర్ణమి నాడు దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల నుండి ప్రతియేటా లక్షల్లో ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Courtesy with - ఎలుగు లింగన్న, ఆదిలాబాద్‌@surya daily news paper(ఆదివారం సెప్టెంబర్‌ 18, 2011)*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment