Friday, January 17, 2014
Kumbeswara Temple-Kumbakonam(Tanjavur dist),కుమ్భేశ్వరాలయం-కుంభకోణం (తంజావూర్ జిల్లా)
నిత్యాభిషేకం లేని శివలింగం-తమిళ నాడు లో కుంభకోణం తంజావూర్ జిల్లాలో ఉంది దీనిని ‘’దక్షిణ దేశపు ఆక్స్ ఫర్డ్ ‘’అని ఇంగ్లీష్ వారే కీర్తించారు .ఇక్కడి కుమ్భేశ్వరాలయం అతి ప్రాచీనమైనది .350అడుగుల పొడవు ,156అడుగుల వెడల్పు ఉన్న పెద్ద ఆలయం పది అంతస్తుల గోపురం ఇక్కడి ఒక వింత .అమ్మవారు మంగళాంబిక ..గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండం లో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుక తో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల కుమ్భేశ్వరుడయ్యాడు అందుకని ఇక్కడ నిత్యాభిషెకాలు ఉండవు . సుగంధ ద్వ్రవ్యాలనే లేపనం గా పూస్తారు ఇదో విచిత్రం . చిత్రమాసం లో సూర్య కిరణాలు లింగం పై పడటం విశేషం . విశాలమైన నట రాజ మండపానికి పెద్ద రాతి చక్రాలు అమర్చబడటం మరో వింత పన్నెండుఏళ్ళకోసారి ఇక్కడ మాఘమాసం లో మహా మాఘం ఇక్కడి కోనేరులో జరగటం ఇంకో విశేషం . పవిత్ర నదులన్నీ ఈ కోనేటిలో ప్రవేస్వ్శిస్తాయని నమ్మకం . లక్షలాది భక్తులు వచ్చి మాఘ స్నానం చేసి స్వామిని దర్శించి వెళ్ళటం మరొక విశేషం కోనేరు విస్తీర్ణం యిరవై ఎకరాలు అందులో ఇరవై రెండు బావులు ఉండటం విశేషాలకే విశేషం .
*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment