Thursday, January 9, 2014
Anantha Padmanabha swamy Revadi,అనంత పద్మనాభ స్వామి-రేవడి
Anantha Padmanabha swamy(Revadi padmanabha vil-Visakhapatnam dist),అనంత పద్మనాభ స్వామి-రేవడి పద్మనాభం గ్రామం(విశాఖపట్నం జిల్లా )
అనంత పద్మనాభ స్వామి పేరు చెప్పగానే మొదటగా కేరళ రాజధాని తిరువనంతపురంలోని భారీ నిధి నిక్షేపాలు కలిగిన అనంత పద్మనాభుడే గుర్తుకొస్తాడు. ఇప్పటికే తిరువనంతపురంలోని పద్మనాభుని ఆలయంలో భారీ సంపద బయటపడింది. స్వామి వారి నేలమాళిగల్లో భారీ సంపద వెలుగులోకి వచ్చింది. అయితే అంత సంపద లేకపోయినా మన రాష్ట్రంలో కూడా అనంతపద్మనాభుడు భక్తుల కొంగుబంగారంగా అలరారుతూ విశేష పూజలందుకుంటున్నాడు... విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో... రేవడి పద్మనాభం గ్రామంలో కొలువై ఉన్న ఆ సాగరతీర అనంతపద్మనాభుడి విశేషాలు.
-ట్రావెన్‌కోర్ సంస్థానాధీశులు వందల ఏళ్ల క్రితం నిర్మించిన అనంతపద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగల్లో 2011లో విశేష సంపద బయటపడిన విషయం తెలిసిందే. తెరిచిన 5 నేలమాళిగల్లో కొన్ని వేల కోట్ల విలువచేసే ఆభరణాలు, నాణేలు వెలుగుచూశాయి. ఆరో నేల మాళిగకు సముద్రానికి లింక్ ఉండటంతో పాటు ఆరో నేల మాళిగ తలుపులకు నాగబంధం ఉండటం వంటి కారణాలతో దానిని తెరిచేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. అలాగే ఆరో నేల మాళిగ తలుపులకు నాగబంధం ఉండటంతో ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరం ఉందని, దానిని తెరిస్తే అరిష్టమని పండితులు హెచ్చరించడంతో సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చేంతవరకు ఆ నేలమాళిగను తెరవద్దని ఖరాఖండిగా చెప్పేసింది.ఇక తిరువనంతపురం పద్మనాభుని సంగతి అటుంచి రాష్ట్రంలోని పద్మ నాభుని ఆలయం గురించి కాస్త తె లుసుకుందాం. సహజ సిద్ధమైన సా గరతీర అందాలతో అలరారుతూ... విశాఖపట్టణానికి 50 కిలో మీటర్ల దూరంలో రేవడి పద్మనాభం అనే గ్రామంలో ఉన్న కొండపై అనంత పద్మనాభుడు కొలువై, తన భక్తుల కు కరుణాపూరితుడుగా భాసిల్లు తున్నాడు.
స్థలపురాణం...
-ఈ కొండకు దిగువన కుంతి మాధవస్వామి ఆలయం ఉంది. ఈ రెండు ఆలయాల గు రించి పురాణ ప్రసిద్ధమైన స్థలపురాణాలున్నాయి. మహా భారత సమయంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న ప్పుడు శ్రీకృష్ణుని ప్రార్థించి, తమకు కర్తవ్య బోధ చేయమని ప్రార్థించారు. అప్పుడు భగవానుడు తాను పద్మనాభుని అంశంతో కొలువై కర్తవ్య బోధ చేస్తానని, ఇక్కడ వ్యక్తావ్యక్త రూపంలో కొలువైనట్లు స్థలపురాణం చెబుతోంది. అలాగే కొండ దిగువన ఉన్న కుంతి మాధవ స్వామి ఆలయానికి సంబంధించీ ఓ స్థలపురాణం ఉంది. కుంతీ దేవి ఇక్కడ మాధవుని విగ్రహ ప్రతిష్ట చేసినందువల్ల స్వామి కి కుంతీమాధవస్వామి అనే పేరు వచ్చినట్లు చెబు తారు. భక్తులు ముందుగా కుంతీ మాధవస్వామిని దర్శించుకుని, అనంతరం కొండపైనున్న అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. ఇది అనాదిగా కొనసాగుతున్న ఆచారం. అనంత పద్మనాభునికి వ్యక్తావ్యక్తరూపం, స్వయంభువు. ఆదిశేషునిపై పద్మ నాభుడు శంఖు చక్రధారియై, లక్ష్మీదేవి సహితంగా కొలువైయ్యాడు. ఈ విశేషాలన్నీ అవ్యక్తంగా ఉంటాయి.
స్వామివారి ఆల యంలో అనంత చతుర్దశిని వైభవంగా చేస్తుం టారు. ఈ కొండపైకి చేరుకోవాలంటే మొత్తం 1278 మెట్లను ఎక్కాలి.దారిలో 423 మెట్లు వద్ద, 850 మెట్టు వద్ద విశ్రాంతి పందిళ్ళున్నాయి. కొండపై నుంచి చూస్తున్నప్పుడు, చుట్టుపక్కలనున్న పచ్చని ప్రకృతి సౌందర్యం మనసులను ఆహ్లాద పరుస్తుంటుంది. రేవిడి పద్మనాభం గ్రామం చేరుకోవాలంటే... విశాఖపట్నం నుండి బస్సు లో చేరుకోవాలి. విశాఖపట్నం నుండి ఇక్కడికి విరివిగా బస్సు సౌకర్యం ఉన్నది.
*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment