Tuesday, January 21, 2014

Kutandavar Temple,కూతాండవర్‌ ఆలయం


 

హిజ్రాలు... ఆడామగా కాని మూడోవర్గం వాళ్లయినా... వాళ్లను పంచముల్లా చూస్తారు చాలామంది. అంతేకాదు, వాళ్లను ఎవ్వరూ చేరదీయరు. ఏడాది పొడవునా ఎన్నో అవమానాలు భరించే హిజ్రాలు... ఆ ఉత్సవంలో ఆనందోత్సాహాలతో గడుపుతారు. చెప్పాలంటే... ఆ ఉత్సవం కోసమే ఏడాదంతా ఎదురుచూస్తుంటారు. అదే హిజ్రాల పండుగ.
ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి ముఖ్యమైన వేడుక. కానీ, హిజ్రాలకు ఆ అదృష్టం ఉండదు. కానీ, ఆ ఉత్సవాల్లో వాళ్లు పెళ్లికూతుళ్లవుతారు. అది ఆ పండుగ వాళ్లకిచ్చిన బహుమతి.
ఏడాదంతా బాధలను దిగమింగుకు బతికినవాళ్లకు... ఆ మూడురోజులూ సంతోషం అంబరాన్నంటుతుంది. అది ఆ పండుగ తెచ్చిన సంబరం.
అదే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని ఉలుందూరుపేటై తాలూకాలోని 'కూవగం' గ్రామంలో 'కూతాండవర్‌' దేవాలయం హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏప్రిల్‌, మే మాసంలో వచ్చే చిత్రైలో వేడుకలు జరుపుతారు. వారు ఆ దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలావారు పెళ్లిచేసుకుంటే కూతాండవర్‌ మరణిస్తాడు. మరురోజు స్త్రీ వేషంలోని వారు రోదిస్తూ గాజులు పగలగొట్టుకొని, కొలనులో స్నానాలు ఆచరిస్తారు.

దీనికో పురాణ గాథ వుంది.--పురాణగాథ :

ఓసారి హిజ్రా కృష్ణుడిని, తాను పొందుకావాలని వరం కోరుకుంటాడు. అలా చేస్తే, ఆ పురుషుడు మరురోజే మరణిస్తాడంటాడు. అయినా ఫరవాలేదంటుంది. దీనికి ప్రతిఫలంగా కురుక్షేత్ర సంగ్రామంతో పాండవుల తరఫున యుద్ధం చేస్తానంటాడు. కృష్ణుడు మోహినీ అవతారం దాల్చుతాడు. మోహినీ బాహువులలో బంధించబడతాడు. యుద్ధంలో 18 రోజులు యితోధికంగా సాయపడి విజయం చేకూర్చి మరణిస్తాడు.

ఇప్పటికీ కూవగంలో 18 రోజులు ఉత్సవాలు చేస్తారు. వారు శ్రీకృష్ణుని అవతారంగా భావించి కూతాండవర్‌ను ఆరాధిస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగలసూత్రాన్ని, గాజులను, పువ్వులను తీసివేసి రోదిస్తారు.

ఇరావంతుడితో పెళ్లి
కూవాగం... లో మామూలు రోజుల్లో పెద్ద హడావుడి కనిపించని ఈ ఊళ్ళో తమిళ చైత్రమాస పౌర్ణమి వచ్చిందంటే వూరంతా జనసంద్రమైపోతుంది. కొన్ని వేలమంది హిజ్రాలు వస్తారు. ఇక్కడే ఉంది కూతాండవర్‌ ఆలయం. ఈ కూతాండవర్‌ మరెవరో కాదు... అర్జునుడి కొడుకైన ఇరావంతుడు. హిజ్రాల కథనం ప్రకారం...
కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలట. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచిస్తాడు. అప్పుడు... అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తుకొస్తాడు. అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు గత్యంతరంలేక కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు. ఆనాడు ఇరావంతుడు, మోహినిల పరిణయానికి సూచికగా... ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. ఇది ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు హిజ్రాలు. ఇందుకోసం రెండునెలల ముందుగానే షాపింగ్‌ మొదలుపెడతారు. ఈ ఉత్సవాలకు హాజరవ్వాలనుకునే హిజ్రాలు జిల్లా కేంద్రమైన విల్లుపురానికి వారంరోజులముందే చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లో హిజ్రాలు... అందం, అలంకరణల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు. ఈ వేడుకలో హిజ్రాలే కాదు... వింత ఆసక్తికొద్దీ ఆడవేషం ధరించాలనుకునే మగాళ్లూ భారీగా పాల్గొంటారు. ఉత్సవంలో భాగంగా విల్లుపురంలో హిజ్రాలకు నృత్యాలూ అందాల పోటీలూ జరుగుతాయి.

కల్యాణం... వైధవ్యం...
తరవాత హిజ్రాలంతా కూవాగం చేరుకుంటారు. వీళ్లను గ్రామస్థులు తమ ఇళ్లకు ఆహ్వానించడం విశేషం. ఈ ఉత్సవంలో అతిముఖ్యమైన ఘట్టం కల్యాణోత్సవం. ఇందుకోసం హిజ్రాలంతా కూవాగం ఆలయంలో వెలసిన ఇరావంతుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని వధువుల్లా మారతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు.
ఆలయ నియమానుసారం మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చట. అందుకే, సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు ఆచారానికోసమన్నట్టు... చేతికి రెండుమూడు గాజులు ధరించి, మల్లెపూలు మెడకు చుట్టుకుని పూజారులతో తాళికట్టించుకుంటారు. అంతేకాదు, చిన్నవాళ్త్లెన మగపిల్లలకు తాళికట్టించుకుని తీసుకెళతారు తల్లిదండ్రులు. ఇక్కడ తాళి కట్టించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. మహిళలు దైవదర్శనం చేసుకోవచ్చుగానీ తాళి కట్టించుకోవడానికి అనర్హులట.
తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు. చెక్కలతో ఇరావంతుని విగ్రహం చేసి వూరంతా వూరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకంగా చెక్కవిగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు... ఇరావంతుని బలి జరిగిందని తెలుసుకుని ఏడవడం మొదలుపెడతారు. గుండెలు బాదుకుని, జుట్టు విరబోసుకుని హాహాకారాలు చేస్తారు. వాళ్లు తెంపిపడేసిన పూలూ పసుపుతాళ్లూ, పగులగొట్టిన గాజులూ పెద్దపెద్ద గుట్టలుగా పేరుకుపోతాయి. అనంతరం హిజ్రాలు స్నానంచేసి వైధవ్యానికి సూచికగా తెల్లచీర, రవికె కట్టుకుని మౌనంగా వూరువిడిచి తమతమ స్వస్థలాలకు బయలుదేరతారు. అలా ఈ ఉత్సవం ముగుస్తుంది. మళ్లీ చైత్రపౌర్ణమి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు.
కొసమెరుపు: ఈ ఉత్సవం హిజ్రాల సమస్యల పరిష్కారానికీ ఒక వేదికగా ఉపయోగపడుతోంది. గత ఉత్సవాల్లో హిజ్రాలకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నెలకు వెయ్యిరూపాయలు పింఛను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
- శ్రీనివాస్‌ హరి, ఈటీవీ2


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

Veerabhadra swamy-kottakonda(Karimnagar dist),వీరభద్రస్వామి దేవాలయం-కొత్తకొండ గ్రామం (కరీంనగర్‌ జిల్లా)

  •  

  •  

-భీమదేవరపల్లి మండల పరిధిలోని కొత్త కొండ గ్రామంలో గల వీరభద్రస్వామి దేవాలయం ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి గాంచినది. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామిగా ప్రసిద్ధిగాంచిన వీరభద్రుడిని దర్శిం చుకునేందుకు కరీంనగర్‌ జిల్లా నుంచే కాక చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవం గా జరుగుతాయి. స్వామివారి కళ్యాణం తో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు, నెలరోజులపాటు జరిగే జాతర ఉత్సవాల లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

దేవాలయం చరిత్ర...
క్రీశ 1600 ప్రాంతంలో కొంతమంది శాలివాహనులు కొత్త కొండ గ్రామశివారులోని కొండపైకి వంట చెరుకు కోసం వెళ్లారు. వారు కర్ర కొట్టుకొని తాము తెచ్చిన ఎడ్లు, బండ్లు కనిపించ కుండా పోయాయి. అంతటా తిరిగి అలసిపోయి ఆ రాత్రి కొండపైనే నిద్రించారట. స్వామివారు వారికి స్వప్నంలో కనిపించి కొండలోని గుహలో విగ్రహ రూపం లో ఉన్న నన్ను కొండపై నుంచి దించి క్రింద ఆలయంలో ప్రతిష్టింపమని ఆజ్ఞాపించారు. దీంతో స్వామి ఆజ్ఞ ప్రకారం స్వామివారిని దూదిమెత్తలలో విగ్రహాన్ని ఉంచి ఆలయంలో శ్రీ మల్లిఖార్జున పండితుని మనవడు కేదారి పండితునిచే ప్రతిష్టించారనే ప్రతీతి ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

స్వామిని దర్శిస్తే... సంతానయోగం...
-కొత్తకొండలోని వీరభద్రస్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నట్లు భక్తుల అపార నమ్మకం. సంతానం లేనివారు స్వామి వారికి కోరమీసాలు సమర్పించు కుంటే పుత్రసంతానం కలుగుతుందని, కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. భక్తుల ద్వారా జరిగే ముఖ్య పూజల్లో కోడెలు కట్టటం, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరములు, అమ్మ వారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, నవగ్రహ పూజలు, ఆంజనేయునికి ఆకుపూజ లు, చందనోత్సవాలు నిర్వహిస్తారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు...
కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారికి పూ జలు చేస్తారు. జనవరి మాసంలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారే ఈ సమయంలో స్వామి వారికి జరుగు బ్ర హ్మోత్సవాల్లో మకర సంక్రాంతి రోజున స్వామివారి సర్వాలంకార నిజదర్శనం చేసుకున్న భక్తులకు సర్వ పీడల నుంచి విముక్తి కులుగు తుందనేది శాస్త్రోక్తి. బ్రహ్మోత్సవాలలో భద్ర కళ్యాణం, భోగి పండుగ రోజున మొక్కుల సమర్పణ, మకర సంక్రాంతి తెల్లవారు జామున అనగా ఉత్తరాయణ పుణ్య కాలంలో స్వామివారిని దర్శించు కుంటారు. మకర సంక్రాంతి రోజున వందలాది ఎడ్లబండ్లు దేవాలయం చుట్టు తిరుగుతాయి. జాతర ముగింపు రోజున అగ్నిగుండాలు జరుగుతాయి, అగ్నిగుండాలలో వందలాది మంది భక్తులు నడిచి పాపాలను పోగొట్టుకుంటారు. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరించి 27 రోజులు దీక్షలు చేపడతారు.

ఆలయానికి ఎలా వెళ్లాలి....
- వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లాలంటే వరంగల్‌ నుంచి 30 కిలో మీటర్లు, కరీంనగర్‌ నుంచి 70 కిలోమీటర్లు, సిద్దిపేట నుంచి 63 కిలో మీటర్ల దూరం ఉంటుంది. సిద్దిపేట నుంచి హన్మకొండకు నిత్యం ప్రతి ఆరగంటకు ఒక ఆర్టీసి బస్సు ఉంటుంది. ఈ రూటు మధ్య లో ఉండే ముల్కనూర్‌ నుంచి కొత్తకొండ వరకు 8 కిలో మీటర్ల ప్రయాణానికి పలువాహనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపుతుంది.

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు...
-వారం రోజుల పాటు కన్నుల పండువగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ఆలయ పూజారులు వేద మంత్రాల మధ్య నిర్వహిస్తారు. జనవరి నెల  9న స్వామివారి కల్యాణంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్ర మాలు జరుగుతాయి. కళ్యాణానికి సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. 10 వ తేదీన మహాన్యాస పూర్వక రుద్రాభిషే కం, 11న గవ్యాతం, నిత్యోపాసన, నిత్యహోమం, నవగ్రహ హోమా లు, 12న బలిహరణ, సూర్యయంత్ర పతిష్టాపన, అరుణ పారాయణం, 13న ఏకా దశి రుద్రహోమం, 14న భోగిపండుగ రోజు న చండీహోమం, వేదపారాయణం, 15న జాతర ప్రారంభం, బండ్లు తిరుగుట, శత రుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 16 న స్వామివారి నాగవెల్లి మహోత్సవం, 17న గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు, స్వామివారి గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

జాతరకు భారీ ఏర్పాట్లు...
-లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కొత్తకొండ జాతరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, సత్రాలు, వైద్య సౌకర్యాలను ఆలయ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌గుప్తా, ఇ.ఓ రామేశ్వర్‌రావు లు ఏర్పాటు చేశారు. హుజురాబాద్‌ డిఎస్‌పి సుదర్శన్‌గౌడ్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించా రు. నలుగురు సిఐలు, 12మంది ఎస్‌ఐలు, 50మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 150మంది కానిస్టేబుళ్లు, 150 మంది హోంగార్డులు, 30 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు, ఒక మహిళా ఎస్‌ ఐ, 4 మహిళా కానిస్టేబుళ్లు, 30 మంది డిస్టిక్‌ గార్డులు మొత్తం సుమారు 500 మంది పోలీసులు జాతర బందోబస్తులో పాల్గొన్నారు.

Courtesy with : Surya Telugu daily - ఆదివారము(ఎడిషన్‌) 02-01-2011.

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Saturday, January 18, 2014

kanchi kamakshi temple,కంచి-కామక్షి ఆలయం

  •  
  •  

కంచి(kanchi)మన వాళ్ళందరికి సుపరిచితమే, తిరుపతి వచ్చిన వాళ్ళు కంచి కూడా వచ్చి కామాక్షి అమ్మవార్ని దర్శించుకుంటారు . మనం బస్సు దిగినవెంటనే ఆటో వాళ్ళు ఆలయాల లిస్ట్ చేతపట్టుకుని మనకి స్వాగతం పలుకుతారు . వార్కొ 150 ఇస్తే కంచి లో ఉన్న కామక్షి ఆలయం(kamakshi temple) ,  ఏకాంబరేశ్వర దేవాలయం , వామన మూర్తి ఆలయం , వరద రాజ స్వామి ఆలయం (బంగారు బల్లి )చూపిస్తారు .
.గుర్రం బండి వాళ్ళు  కూడా ఉంటారు  (80 /-).. నిజానికి  వరద రాజ స్వామి ఆలయం తప్ప మిగిలినవి 1కి.మి. లోపు దూరంలోనే  ఉంటాయ్ .

కాంచీపురం(kanchipuram), కంచి(kanchi), లేదా కాంజీపురం:
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః | |
 భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం,అద్వైతవిద్యకు ఆధారస్ధానం . ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డణాం. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం . అతి ప్రధానమైన శక్తిక్షేత్రం, పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహాముక్తి నందిన పుణ్యస్ధలం.
శ్రీ కామాక్షి అమ్మవారిగుడి :
అమ్మవారి గుడి బస్సు స్టాండ్ కి దగ్గరలోనే కలదు . "కా" అంటే "లక్ష్మి",  "మా" అంటే "సరస్వతి", "అక్షి"   అంటే "కన్ను".   కామాక్షి దేవి  అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది. ఈ దేవాలయంలో  శ్రీకామాక్షిదేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి ఉన్నారు.
అమ్మవారి గుడిలోకి అడుగు పేట్టిన  వేంటనే మనకి సాదారణంగ  ఏనుగు స్వాగతం పలుకుతుంది.
 ఆలయ ప్రవేశానికి టికెట్ ఏమి లేదు.  మీరు ఆలయంలోకి వేళ్ళేముందు అమ్మవారి వాహనన్ని ఒకసారి చూసి వేళ్ళండి . ఒక కాలు పైకి ఎత్తి యుద్దానికి సిద్దంగా ఉన్నాను అని అమ్మవార్కి చెప్తున్నట్టు కనిపిస్తుంది .

అమ్మవారి గర్బగుడి దగ్గరవుతున్న సమయం లో వరుస రెండుగా విడిపొతుంది . మీరు లోపలి వరసలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ ఉన్న వాళ్ళని  బ్రతిమిలాడితే (కస్తా ముట్టచెప్తే) అనుమతి  ఇస్తారు .. ఖాళీగ ఉంటే  ఎ సమస్య లేదు . మీరు అమ్మవారి దర్శనం అయిన తరువాత వెనక్కి వచ్చి మేట్లు ఏక్కితే మీరు అమ్మవారి ఉత్సావ మూర్తులు ఉన్నచోటికి వస్తారు  ,.. ఆక్కడ నుంచి అమ్మవారు చాల చక్కగ కనిపిస్తారు .. మీరు ఎంతసేపైన  చూడవచ్చు . ఆక్కడ మీరు కాసేపు కుర్చునే వీలు ఉంటుంది ..మీరు క్రిందకు దిగిన వేంటనే ఆదిశంకరుల దర్శనం  చేస్కోనవచ్చును . మీరు కాస్త గమనిస్తే ఆదిశంకరుల ఆలయం పక్కన (మీకు కుడిచేతివైపు అరుగు మీద - కాస్త పైకి ఏక్కితె) ఆది శంకరుల చరిత్ర బొమ్మలతో వివరించి ఉంటుంది . మీరు గుడిలో కాశి విశాలాక్షి అమ్మవార్ని కూడా చూడవచ్చు .
బయటకి వచ్చిన తరువాత  వేనకవైపు ఉన్న కోనేరు -వేపచెట్టు - అమ్మవారి గుడి - పెద్ద మండపం  చూడవచ్చు.
----------------------------------------------
శ్రీ వామనమూర్తి దేవాలయము : (ఉలగళందప్పెరుమాళ్)        
  •    


అమ్మవారి ఆలయం కి అతి సమిపంలోనే వామనమూర్తి గుడి ఉంది (ఆలయానికి ఎదురుగ నడిచి కుడిచేతివైపుకు తిరగాలి.) . ఆలయంలో లోపల  చీకటిగ ఉంటుంది. మనం జాగ్రత్త చూడలి వామనముర్తి ఆకాశం  వైపు ఒకకాలు పేట్టి మరోకాలితో బలిచక్రవర్తి తలపై వేసిన వామన మూర్తిని మనం దర్శించవచ్చు.దర్శనానికి టికెట్ ఏమిలేదు.
 ఆదిశేషునికి ప్రత్యేకమైన సన్నిధి కలదు.

--------------------------------------------
రామనాధ స్వామి ఆలయం :
  •  
  •  
తిరిగి అమ్మవారి ఆలయనికి చేరుకుని అమ్మవారి ఆలయానికి కుడిచేతివైపు  నడిస్తె మనకి మైన్ రొడ్డు వస్తుంది .
...మళ్ళి మనం ఏడమచేతివైపు కి నడిస్తే   శంకర మఠం  దాటిన తరువాత  ఏకాంబరేశ్వర దేవాలయం కనిపిస్తుంది . ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగ రామనాధ స్వామి ఆలయం కనిపిస్తుంది.   రామేశ్వరం  వెళ్ళకుండానే   ఇక్కడే మీరు శివయ్య గార్ని దర్శించుకోవచ్చు  .

-------------------------------------------------
ఏకాంబరేశ్వర దేవాలయం:

ఇక్కడ మీకు కనిపిస్తున్న గాలిగోపురం ఎత్తు 192 అడుగులు
పంచభూతలింగక్షేత్రము లలో  కంచి లో పృధ్వీ లింగం  ఉంది. ఈ పంచభూత లింగములు వరుసగా
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం

మీకు పర్వతి దేవి శివుని కన్నులు మూయడం , అందువల్ల  జరిగిన పరిణామలు వళ్ళ పార్వతి దేవి తపస్సుకు బయలు దేరడం , ముందుగా కాశీ లో తప్పస్సు చేయడం , అక్కడనుంచి కంచి వచ్చి  మామిడ చెట్టు క్రింద సైకిత లింగం చేసి పూజలు చేస్తూ ఉండటం, పరమశివుడు  అమ్మవార్ని పరిక్షింపదలచడం తత్ఫలితంగా  కంపానది పోంగడం పార్వతి దేవి ఇసుకతొ చేసిన లింగ కొట్టుకుని పొకుండా  ఆలింగనం చేసుకోవడం ..  శివుడు సంతొషించి అనుగ్రహించడం అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అరుణాచలం  లో  ఆర్దనారీశ్వరులుగా ఏకమవడం ఉండడము చూడగలము  .

మనం  గాలిగోపురం వద్దకు వెళ్ళగానే  ఆలయం వేనకవైపు అమ్మవారు తపస్సు చేసిన మామిడ చేట్టు మనం చూడవచ్చు. ఏకాంబరేశ్వరాలయం అని పిలుస్తున్నాం కదా నిజానికి  ఏకాంబరేశ్వరాలయం కాదు  ఏకామ్రేశ్వర దేవాలయం  . ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు.ఏకామ్రేశ్వరస్వామి ఆంటే  మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం.ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు .
 ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాసశ్థ్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం .
ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో,దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. 
 ఈ మామిడి వృక్షం క్రింద పార్వతిపరమేశ్వరులు, పార్వతిదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.
 మీకు కంపనది .. కంపనది అంటే మన గోదారి లా ఉంటుంది అనుకోకండి ... కోనేరులా ఉంది లోపల .. ఇప్పుడు నీరు ఎం లేదు అక్కడ .. మీరు వెళ్ళినప్పుడు నీరు ఉంటె చూసిరండి .మనం గాలిగోపురం దాటిన తరువాత  ఈ ఆలయానకి మధ్యలో మనకి కంపనది కనిపిస్తుంది .
మధ్యాహ్నం భోజనం కుడా (అన్నదానం) ఉంది .. కాకపోతే తక్కువ మంది కి పెడతారు (50).. ఆ టైం లో మీరు అక్కడ ఉంటె ప్రసాదం స్వీకరించి రండి .

కంచి కామకోటి పీఠం ;
సాక్షాత్తు ఆదిశంకరచార్యుల వారే పిఠాదిపతిగా  ఉన్న పీఠం కంచి పీఠం ..కాంచిపురం లో ఆలయాలు అన్ని తిరిగివచ్చి కంచిమఠం లో పీఠాదిపతులను  దర్శించుకున్న తరువాత  ఒక 2 గంటల పాటు శంకరేంద్ర సరస్వతి వారి బృందావనం దగ్గర లో గడపడం అంటే  చాల ఇష్ఠం . మీరు మధ్యాహ్నం 12-1  సమయంలో వేల్లితే పీఠాది పతుల  చేసే పూజమీరు చూడవచ్చు . పూజ అయిన తరువాత పీఠదిపతులు మనకి దర్శనం ఇస్తారు .   కంచి మఠం లో మనం పీఠాదిపతుల ఇద్దరిని (Sri Jayendra Saraswati &Sri Sankara Vijayendra Saraswati ) దర్శించవచ్చు.

 శ్రీ విజయేంద్ర  సరస్వతి(Sri Sankara Vijayendra Saraswati) వారు ఇక్కడే మనకు దర్శనం ఇస్తారు ..
 The 7Oth Pontiff His Holiness Sri Sankara Vijayendra Saraswati Swamigal
 మీరు మఠం లో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి(The 68th Pontiff His Holiness Sri Chandrasekharendra Saraswati Swamigal ) వారి బృందావనం కూడ ఛూడవచ్చు .
 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తేజస్సు ఇప్పడికి మనం ఇక్కడ  చూడవచ్చు .. మీరు ప్రత్యక్షంగ ఏప్పుడు చూడకపోయిన ఇక్కడ చూస్తే మనకు ఆలోటు తీరుతుంది.
 మీరు అక్కడ ఉన్న స్వామీ వారి ఫోటో లు కూడా చూడవచ్చు .

కంచి మఠం వారి అన్నదాన సత్రం :
కంచి మఠం దగ్గరలోనే అన్నదాన సత్రం ఉంది . ఎక్కడ అంటే మీరు ఏకామ్రేశ్వర ఆలయానికి వెళ్లారు కదా .. అక్కడకి దగ్గరలోనే ఉంటుంది . పెట్రోల్ బంక్ పక్కనే అంటే మీకు ఈజీ గా అర్ధం అవుతుంది . కంచి వెళ్లి బయట ఎక్కడో భోజనం చేయడం కంటే ఇక్కడ ప్రసాద్దాన్ని స్వీకరించడం ఉత్తమం అని నా అభిప్రాయం .
 మీరు ఈ ఫోటో చూసి లోపలికి వేళ్తరేమో  .. పక్కనే ఒక బుల్డింగ్ కనిపిస్తుంది చూడండి.. అదే సత్రం.. బయట తమిళం లో బోర్డు ఉంటుంది ...
*మీరు పూజ చూసిన తరువాత ఇక్కడికి వచ్చి భోజనం చేసి మఠానికి వెళ్తే మీరు పీఠాదిపతులను దర్శించిన మీరు అక్కడే విశ్రాంతి తిస్కోవచ్చు . ఆ టైం లో ఏ దేవాలయం తెరిచి ఉండదు .

-------------------------------------------

కుమరకోట్టము - శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయము

  ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో ఉండదు . కంచి మఠం నుంచి దగ్గరలోనే ఉంటుంది . అక్కడ ఉన్న వార్ని కుమరకోట్టము అని అడిగితె వాళ్ళకి అర్ధం అవుతుంది . ఈ  ఆలయ శివాచార్యులు శ్రీ కచ్చియప్ప శివాచార్యులవారిచే తమిళ భాషలో కందపురాణాము రచించారు . ఈ  కందపురాణాము కావ్య ఆవిష్కరణ సమయమున పండితులమధ్య సభామండపంలో శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించడం జరిగింది అంట.

ఈ ఆలయ గోపురం పక్కనే ఆనాటి జరిగిన సంఘనట చిత్రీకరించి ఉంటుంది . మీరు చూడవచ్చు.  సుబ్రహ్మణ్య ఆలయం లోపల శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించిన  మండపం ఉంటుంది .

---------------------------------------------------

శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము

శ్రీ కుమారస్వామి ఆలయమునుకు దగ్గరలోనే శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము  ఉంది . మీరు గుడి బయటకు వచ్చిన తరువాత కుడివైపుకు నడిస్తే ఈ ఆలయ గోపురం కనిపిస్తుంది . ఈ ఆలయం గుడి ఆటో వాళ్ళు చూపించారు . చాల పెద్ద ఆలయం ఇది . బహుశా అందుకే ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో కనిపించదు మనకు .
 ఈ ఆలయం కోసం చెప్పమంటారా .. ఈ ఆలయం లోనే శ్రీ మహా విష్ణువు పరమశివుణ్ణి తాబేలు రూపంలో పూజించినట్లు పురాణము. అందుచేత  కచ్ఛపేశ్వరుడు అనిపేరువచ్చింది. కచ్చ అంటే తాబేలు అని అర్ధం . చాల పెద్ద ఆలయం అని .
 ఇక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేస్తే రోగాలు నివృతి అవుతాయని చెప్తారు . చాల మంది స్నానం చేస్తారు కూడా . ఈ ఆలయం లో మనం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి , శక్తి గణపతి , దుర్గా ,సరస్వతి , సూర్యునికి ప్రత్యేక సన్నిది ఉంది .
ఈ ఆలయం లో పెద్ద రావి చెట్టు ఉంది.  రావి చెట్టు పక్కనే ఒక శివాలయం ఉంది పేరు తెలియదు .ఆ ఆలయం పైన దక్షిణామూర్తి ఉంటటారు  .

 ----------------------------------------------------

శ్రీ కైలాస నాధుని ఆలయము


శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము నుంచి సుమారు 2km దూరం లో కైలాస నాధుని ఆలయము ఉంది . ఆలయం పక్కనుంచే దారి ఉంది .. నారదుడు శివలింగాన్ని ప్రతిష్ఠించడాని చేప్తారు.. ఈ ఆలయం చాల పురాతనమైనది మనకు కనిపిస్తుంది. ఆలయం బయట పార్క్  లాగ కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగ ఉంటుంది. శివును చుట్టు ప్రదిక్షణం చెస్తే జన్మరాహిత్యము కలుగుతుందని భక్తుల నమ్మకము . 
 మనకు కంచి అనగానే గుర్తుకు వచ్చేది బంగారు బల్లి కదా .....  బంగారు బల్లి వెండి బల్లి రెండు వరదరాజ స్వామి గుడిలో ఉంటాయ్ .. మీరు ఇక్కడ నుంచి  కచ్ఛపేశ్వరుని ఆలయము దగ్గరకు వస్తే ఆటోలు ఉంటాయ్.. ఇక్కడనుంచి సుమారుగా3  km ఉంటుంది .. మీరు అక్కడే బంగారు బల్లి ని చూడగలరు .

----------------------------------------------------------

శ్రీ వరదరాజస్వామి  ఆలయము



కంచి లో ప్రతి ఆలయ గోపురం ఇలానే ఉంటాయ్ ..అందులో ఏకామ్రేశ్వరస్వామి ఆలయంలో మనం చూసిన గాలిపురం తరువాత ఈ ఆలయ గోపురమే పెద్దది .. వాడుకలో కోయిల్  - తిరుమల - పెరుమాళ్ కోయిల్ అని పిలబడు 108 వైష్ణవ దివ్య క్షేత్రములలో  మూడవ స్థానమును ఈ వరదరాజస్వామి వారిదే . కోయిల్ అంటే శ్రీ రంగం శ్రీ రంగనాధ ఆలయము , తిరుమల అంటే నేను చేప్పాల ? పెరుమాళ్ కోయిల్ అంటే వరదరాజస్వామి వారి ఆలయము .
బ్రహ్మదేవుడు చేసిన యాగంలో యాగ-గుండము నుంచి శ్రీ మన్నారాయణుడు శ్రీ వరదరాజ స్వామి రూపంలో అవిర్భావించినట్లు స్థలపురాణము .

బల్లి కధ --
ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు.
ఇక్కడ అమ్మవారు పేరు పేరుందేవి .. మహావిష్ణువు నిజస్వరూపాన్ని చూస్తున్నామ అన్నట్టుగా .. ఈ ఆలయం లో మనకు దర్శనం ఇస్తారు .. అదో గొప్ప అనుభూతు నేను ఇక్కడ మీకు చెప్పడం కష్టం . స్వామివార్ని చుసినతరువాత మనం బల్లి దగ్గరకు వెళ్తాం . బల్లి ని చూడటానికి టికెట్ తీస్కోవాలి .. ఇక్కడ కోనేరు ను  ఆనంద పుష్కరిణి అంటారు . ఈ ఆనంద పుష్కరిణి లో వరదుని ప్రాచీన మూలవిగ్రహాన్ని 40 సంవత్సరములకు ఒకసారి తీసి వెలుపలకు తీసి 40 రోజులు భక్తుల దర్శనార్ధం ఉంచుతారు . 2019 జూన్ నెలలో మరల స్వామి వార్ని బయటకు తీసుకుని వస్తారంట..

* కంచి నుంచి శ్రీపురం(golden temple) వెళ్ళడానికి బస్సులు కలవు . కంచి నుంచి 2 -3 గంటల ప్రయాణం . కంచి నుంచి తిరుపతి 3 -4 గంటల ప్రయాణం.

 
 Courtesy with : Rajachandra akkireddi --Kancheepuram-Chengalpat, Kanchipuram, Tamil Nadu, India@http://www.templeinformation.in/


*=================================*

* Visit my website : Dr.Seshagirirao.com

Friday, January 17, 2014

Devotional...Health-Swamiye Saranam Ayyappa,ఆధ్యాత్మికం...ఆరోగ్యం-స్వామియే శరణం అయ్యప్ప




  •  -Sabarimalai Ashramam

‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ... ఆంధ్రదేశం మారుమ్రోగుతోంది. ఏటేటా అయ్యప్ప దీక్షాదారుల సంఖ్య పెరుగుతూ... కార్తీక మాసారంభంలో జోరందుకున్నాయి. ‘శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం’ అంటూ భక్తులు అచంచల భక్తితో... అత్యంత కఠినమైన నియమనిష్ఠలతో దైవంపై సంపూర్ణ విశ్వాసంతో ఈ దీక్షను చేపడుతున్నారు. ఆ మణికంఠుడు భక్తుల పాలిట కల్పతరువుగా కోరిన కోర్కెలు తీరుస్తూనే ఉన్నాడు. దానికి ఏటేటా పెరుగుతున్న కన్నెస్వాములే ప్రత్యక్ష నిదర్శనం...

-అయ్యప్ప దీక్ష మతసామరస్యానికి ప్రతీక. కులం, మతం, చిన్న, పెద్దా తేడా లేకుం డా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడ మే దీక్ష పరమార్థం. దీని ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై, సంపూర్ణ ఆరోగ్యం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవడుతుంది. కేరళ రాష్ట్రంలో ప్రారంభమైన అయ్యప్ప దీక్ష నేడు దక్షిణ భారతదేశమంతటా విస్తరించింది. అన్ని ప్రాంతాల కంటే మన రాష్ర్టంలోనే అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కఠిన నియమాలు ఆచ రిస్తూ దీక్షా కాలాన్ని పరిపూర్ణం గావిస్తారనే మంచి పేరుంది.

ఏటేటా అయ్యప్ప దీక్ష తీసు కునే స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ దీక్షలు సాధారణంగా కార్తీక మాసంతో ప్రా రంభమై మకర సంక్రాంతి పర్వదినం వరకు కొనసాగుతాయి. అయ్యప్ప దీక్షా పరులు నలు పు/కాషాయం రంగుల్లో దుస్తులు ధరించి 41 రోజుల పాటు కఠిన నియమ నిష్ఠలతో ఉద యం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్విహస్తూ తరిస్తున్నారు. దీక్ష తీసుకున్న స్వా ములు ప్రతి ఒక్కరిని దేవుడి ప్రతి రూపంగా భావిస్తూ ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ నామాన్ని జపిస్తుంటారు. దీక్ష వల్ల మనఃశ్శాం తి, క్రమశిక్షణ ధార్మిక భావాలు పెంపొందుతా యంటారు గురుస్వాములు.
దీక్ష నియమాలు...
అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకునే స్వాములు ముందుగా 108 తులసి లేదా రుద్రాక్షలతో అయ్యప్ప స్వామి ప్రతిమను కలిగిన మాలను అల్లించుకోవాలి. నల్ల బట్టలు, మాల తీసుకుని సమీపంలోని అయ్యప్ప దేవాలయాల్లో గురు స్వామితో కానీ ఆలయ అర్చకులతో కానీ మాలధారణ చేయించుకోవాలి. మాల మెడలో పడిన క్షణం నుంచి దీక్ష ప్రారంభమవుతుంది. నల్ల బట్టలు, నుదుట గంధం బొట్టు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ప్రతివారి ని అయ్యప్ప స్వామి ప్రతి రూపంగా భావించి ‘స్వామి’ అని సంబోధించాలి.

ప్రతి రోజు సూ ర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత చన్నీళ్లతో శిరస్నానం చేయాలి. ఉద యం, సాయంత్రం వేళల్లో స్వామి వారికి పూజలు నిర్వహించాలి. ఒక పూట భోజనం చేసి రాత్రి పూట అల్పాహారం లేదా పాలు, పళ్లు మాత్రమే తీసుకోవాలి. కటిక నేల మీద నిద్రించాలి. దీక్షా కాలంలో క్షుర కర్మలు చేయడంగాని, వేలి గోర్లను తీయడంగాని చేయకూడదు. ఆడవారిని తోబుట్టువులుగా, తల్లిగా భావించాలి. కోపతాపాలకు, అశుభ కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజూ దైవరాధన చేస్తూ ప్రశాంత జీవనం గడపాలి. 41 రోజుల పాటు దీక్షను కొనసాగించిన అనంతరం ఇరుముడి ధరించి శబరిమల యాత్రను పూర్తి చేయాలి. శబరియాత్ర పూర్తి చేసి ఇంటికి చేరిన తర్వాత తల్లితో కానీ, భార్యతో కానీ లేదా దేవాలయ అర్చకుల చేత మాల విరమణ చేయించుకోవాలి.

పడి పూజ...
అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు తమ దీక్షా కాలంలో మెట్ల పూజ (పడిపూజ) నిర్వ హించి కనీసం ఐదుగురు స్వాములకు భిక్ష (భోజనం) లేదా అల్పాహారం పెట్టడం ఆనవా యితీ. పడిపూజ నిర్వహించాలనుకున్న వారు అరటి బోదెలతో మండపం నిర్మిస్తారు. అందు లో అయ్యప్ప స్వామి చిత్ర పటాన్ని ఏర్పాటు చేస్తారు. శబరిమల దేవాలయం వద్ద ఉన్నట్లు గా 18 మెట్లను తయారు చేసి, ఒక్కో మెట్టు ను ఒక్కో దేవుడి ప్రతి రూపంగా భావించి మె ట్ల పూజ నిర్విహస్తారు. మెట్ల పూజలో భాగం గా అయ్యప్ప స్వామికి వివిధ రకాల అభిషేకా లు నిర్వహిస్తారు. పడిపూజలో స్వాములు పాల్గొని భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.

దీక్షతో ఆరోగ్యం...
-అయ్యప్ప మండల దీక్షతో ఆధ్యాత్మిక చింతన తో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శాస్ర్తీ య పద్ధతుల ప్రకారం పురాతన కాలం నుంచి కొన్ని రకాలైన వ్యాధులకు ఆయుర్వేద చికిత్స చేయడానికి, యోగ సాధనకు మండల కాలం (41 రోజులు) ప్రామాణికంగా వాడుతున్నారు. చన్నీటి స్నానం, ఒక్క పూట భోజనం, దేవతా రాధన వంటి అలవాట్లు మనిషి జీవితంపై చక్క టి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఉద యం, సాయంత్రాలలో చన్నీటి శిర స్నానాలు చేయడం వల్ల మెదడులోని సున్నిత నరాలు స్పందించి సునిశిత శక్తి, ఏకాగ్రత, ఉత్తేజం కలగడమే కాకుండా శరీరంలోని వేడి కూడా సమతుల్యమవుతుంది. నుదుటిపై చందనం, కుంకుమ, విభూతి ధరించడం వల్ల భృగు మధ్య భాగంలోని అతి సున్నిత నరాలకు చల్ల దనాన్ని ఇవ్వడమే గాక గంధం సువానస మానసిక ప్రశాంతతనిస్తుంది.
వనమూలికల తో తయారయ్యే విభూతి యాంటీబాక్టీరియల్‌ గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుం ది. దీక్షా కాలంలో ధరించే నలుపు రంగు బట ్టలు వేడిని గ్రహించి దేహానికి వెచ్చదనాన్ని ఇస్తా యి. కాళ్లకు చెప్పులు ధరించకుండా నవడవ డం వల్ల భూమిపై ఉండే చిన్న చిన్న రాళ్లు, మ ట్టి గడ్డలు పాదాలకు సున్నితంగా గుచ్చుకుని ఓ రకంగా ఆక్యూపంక్చర్‌ చర్య జరిగి నరాల కు స్పందన కలుగుతుంది. దాంతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒం టి పూట భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. అయ్యప్ప దీక్షతో మానసిక, శారీరక ఉత్తేజం కలిగి అత్మస్థైర్యం, ఏకాగ్రత పెంపొందుతాయి.

అయ్యప్పకు కన్నెస్వామి అంటే ప్రీతి
అయ్యప్ప దీక్షను పురుషులు ఏ వయసు లో ఉన్నా కుల, మత భేదం లేకుండా తీసు కోవచ్చు. అమ్మాయిలైతే పదేళ్ల లోపు వారు, మహిళలైతే 55 ఏళ్ల పైబడ్డ వారు మాత్రమే దీక్ష తీసుకునేందుకు అర్హులు. మొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకునే వారిని కన్నె స్వాములుగా, రెండవ సారి తీసుకున్న వారిని కత్తి స్వాములుగా, మూ డవ సారి గంట స్వాములుగా, నాల్గవ సారి గద స్వాములుగా, ఐదవ సారికి గురుస్వా ములుగా పిలుస్తారు. వీరందరిలో కన్నె స్వాములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు దీక్ష తీసుకున్న స్వాములు ప్రతి ఏటా ఒకరిద్దరు కొత్త వ్య క్తులతో దీక్ష చేపట్టించి తమ వెంట శబరి మలకు తీసుకెళ్తారు. అయ్యప్ప స్వామికి కన్నె స్వాములంటే మహా ఇష్టమని ప్రతీతి.

యాత్ర అంత కష్టమా ?
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి చాలా మంది జంకుతారు. ఎందువల్ల? ఈ ప్రశ్న కు చాలామందికి తెలిసిన జవాబు అది అ త్యంత కఠినతరమని. ఇదొక్కటి మాత్రమే కాదు, వారు శబరిమల యాత్ర తప్పనిసరి గా చేయాలి. నలబై ఒక్క రోజులకు బదులు ఏదో కొద్ది రోజులు మాల వేసుకొని, శబరి మల వరకు వెళ్ళకుండా, మరెక్కడో ఒక అయ్యప్పస్వామి ఊరువెళ్ళి దీక్షను ముగించే వారి గురించి కూడా వింటున్నాం. నిబంధన ప్రకారమైతే దీక్ష ఎంత కఠినమో శబరిమల యాత్ర కూడా అంతే సాహసోపేతం. చాలా మందిని భయపెడుతున్న అంశాలలో ఇదీ ప్రధానమైంది.

-నిజానికి శబరిమలయాత్ర అంత కష్టమా? అంటే కాదనే చెప్పాలి. దైవం పై పరిపూర్ణ విశ్వాసం, ప్రేమతో ముందుకు వస్తే అలాం టి భయాలేవీ ఉండవు. పిల్లలు, వృద్ధ స్ర్తీలు, వృద్దులు, వికలాంగుల సైతం అనేక కష్టాల కు ఓర్చుకుంటూ అడవి మార్గంలో కాలినడ కన వెళ్ళగా లేనిది అన్నీ ఉన్న అనేకమంది అందుకు ముందుకు రాకపోవడానికి అసలై న కారణం సంకల్ప లోపం. వారికి నిజంగా దైవం మీద భక్తి ఉంటే ఎవరికీ తెలియని ఆ ధ్యాత్మిక శక్తి స్వయంగా వారిని నడిపించు కుంటూ వెళుతుంది.

దీక్ష తీసుకున్న వారికి అడుగడుగునా కష్టాలు కలగడం సహజం. అవి కేవలం స్వామి పరీక్షలే తప్ప మరోటి కాదనుకోవాలి. చివరకు ఆ భగవంతుడి మీ దే సమస్త భారాలు వేసి అన్నింటినీ, అందరి నీ వదిలి అడవి మార్గంలో బయలు దేరుతా రు. నియమాలు, నిష్ఠల విషయంలో ఏ మే రకు క్రమశిక్షణను పాటిస్తామన్న దాని పైనే వారి భక్తి నాణ్యత ఆధారపడి ఉంటుందన్న ది గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారి దీక్ష తీసుకొనే వారు విధిగా పెద పాదం గుండా నే వెళ్ళాలన్న నియమం ఒకటి ఉంది. భయ పడే వారు భయపడుతున్నా, ప్రగాఢ భక్తి తత్పరతతో ఆ మార్గం గుండానే వెళుతున్న వారు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.

పదునెట్టాంబడి విశిష్టత...
-శ్రీ అయ్యప్ప సన్నిధానంలోని పదునెట్టాం బడి (పదునెనిమిది మెట్లు) ఎక్కడాన్ని భక్తు లు అదృష్టంగా భావిస్తారు. మెట్లను దేవ తలకు ప్రతి రూపాలుగా భావిస్తారు. 18 మెట్లకు 18 విశిష్టతలు ఉన్నాయి.
  • Steps.
1వ మెట్టు అణిమ
2వ మెట్టు లఘిమ
3వ మెట్టు మహిమ
4వ మెట్టు ఈశత్వ
5వ మెట్టు వశత్వ
6వ మెట్టు ప్రాకామ్య
7వ మెట్టు బుద్ధి
8వ మెట్టు ఇచ్ఛ
9వ మెట్టు ప్రాప్తి
10వ మెట్టు సర్వకామ
11వ మెట్టు సర్వ సంవత్కర
12వ మెట్టు సర్వ ప్రియాకార
13వ మెట్టు సర్వ మంగళాకార
14వ మెట్టు సర్వ దుఃఖ విమోచన
15వ మెట్టు సర్వ మృత్యువశ్యమణ
16వ మెట్టు సత్యవిఘ్న నివారణ
17వ మెట్టు సర్వాంగ సుందర
18వ మెట్టు సర్వ సౌభాగ్యదాయక

37 ఏళ్లుగా నిరాటకంగా మాలధారణ
-రామగుండం ఎన్టీపీసీలో కేరళ రాష్ట్రానికి చెందిన కొందరు పని చేస్తుండేవారు. అయ్యప్ప దీక్ష తీసుకుని వారు చేసే పూజా కార్య క్రమాలు, భజనలను చూసి నేను ఆకర్షితుడనయ్యాను. మళయా ళీల ప్రోత్సాహంతో అయ్యప్ప దీక్షను మొట్టమొదటిసారిగా 1974 లో తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా 37 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుని స్వామి సేవలో తరిస్తున్నాను. అయ్యప్ప దీక్షలో ఉన్న మధురానుభూతి మరే దీక్షలో ఉండదనేది నా అభిప్రాయం. మన కోసం... మన కుటుంబం కోసం తీసుకునేదే అయ్యప్ప దీక్ష. దీక్షలో మనసా... వాచా... కర్మణా స్వామిని ధ్యానిస్తూ దీక్షను పరిపూర్ణం గావించాలి. దేహాన్ని కొబ్బరికాయగా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియ ఈ అయ్యప్ప దీక్షలో ఉన్న విశిష్టత.---- చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, గురుస్వామి

అయ్యప్ప దీక్షలో కఠిన నియమాలు
-అయ్యప్ప దీక్ష కఠిన నియమాలతో కూడు కున్నది. ఎంత నియ మ నిష్ఠలతో ఉంటే అంత సులువుగా శబరియాత్ర చేయ వచ్చు. అయ్యప్ప దీక్షలో కుల మత భేదం, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ని భగ వంతుడి స్వరూపంగా భావించాలి. 20 ఏళ్ల క్రితం పదుల సంఖ్యలో ఉండే అయ్యప్ప దీక్షాపరులు నేడు వేల సంఖ్యకు చేరుకున్నా రు. ప్రతి యేటా అయ్యప్ప దీక్ష లు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉం ది. మిగతా ప్రాంతాల్లో కంటే మన రాష్ట్రం లోనే అయ్య ప్ప దీక్షను నియమ నిష్ఠలతో చేపడతారు.---- దీటి సతీష్‌, గురుస్వామ

దీక్ష ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపింది
-అయ్యప్ప దీక్ష ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలా మంది అయ్య ప్ప దీక్ష తీసుకుని వ్యసనాలకు దూరమయ్యారు. తమ జీవితంలో వచ్చిన మార్పుతో ప్రతి యేటా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ స్వామి సేవలో తరిస్తున్నారు. 16 ఏళ్ల క్రితం అయ్యప్ప దీక్షాపరులు దేవాలయంలో చేసిన పూజలు, భజనలకు ఆకర్షితుడనై స్వామి దీక్ష తీసుకున్న నేను నిరాటంకంగా 16 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుని స్వామి దర్శనం చేసుకుంటున్నారు. నా కుటుంబంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని స్వామి సన్నిధానానికి తీసుకెళ్లాను. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా స్వామి సన్నిధానాన్ని దర్శించుకుంటే అంతకు మించిన మహాభాగ్యం లేదు.---- అడువాల శ్రీనివాస్‌,గురుస్వామి

దీక్షతోనే నా జీవితం మలుపు తిరిగింది.
-sఅయ్యప్ప దీక్షతోనే నా జీవితం మలుపు తిరి గింది. 13 ఏళ్ల క్రితం నా కుటుంబ పరిస్థితి దుర్భరంగా ఉండేది. అయ్యప్ప దీక్ష తీసుకు న్న నేను ఆ తర్వాత జీవితంలో వెనక్కి తిరి గి చూడలేదు. స్వామి దయ వల్ల ఆర్థిక స మస్యలన్నీ తీరిపోయాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశం వెళ్లిన నేను అక్కడ దీక్ష తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ దీక్షా సమయంలో ఎలా ఉండేవాడినో అక్క డ కూడా ప్రతి సంవత్సరం మాల, నల్లబట్ట లు ధరించకుండానే నియమనిష్ఠలతో అ య్యప్ప స్వామిని ధ్యానించేవాడిని. స్వామి దయ వల్ల ఆర్థికంగా ఎదిగిన నేను స్వామి వారి ఆలయ అభివృద్ధి ఇతోధికంగా సా యం చేస్తున్నాను. మున్ముందు కూడా సా యం చేస్తాను. దీక్ష తీసుకోవడం వల్ల నా జీ వితంలో వచ్చిన మార్పును ప్రతి ఒక్కరికి చెబుతూ దీక్ష తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నాను.---- రాపర్తి రమేశ్‌, గురుస్వామి

ఇరుముడి...
-అయ్యప్ప దీక్షలో ప్రాచుర్యం, పవిత్రత కలిగి ఉండేది ఇరుముడి. ఇరుముడి రెండు భాగా లను కలిగి ఉండి యాత్ర కోసం తలపై ధరిం చేందుకు వీలుగా ఉంటుంది. ఇరుముడిలో ఒ భాగంలో పూజా ద్రవ్యాలు, మరో భాగం లో ఆహార ధాన్యాలు, ఆవు నెయ్యితో నింపిన కొబ్బరి కాయను ఉంచుతారు. శబరిమల అయ్యప్ప దేవాలయం ముందు ఉన్న పదు నెట్టాంబడి ఎక్కాలంటే తలపై ఇరుముడి ఉన్న వారినే అనుమతిస్తారు. దేవాలయానికి చేరు కున్న భక్తులు ఇరుముడిలోని కొబ్బరి కాయ లో నింపిన నెయ్యితో మూల విరాట్టుకు అభిషే కం జరిపిస్తారు. కొబ్బరి ముక్కలను ఆలయ ప్రాంగణంలోని హోమ గుండంలో వేస్తారు. ఇరుముడిలోని ఆహార ధాన్యాలతో భోజనం వండుకుని తింటారు. దేహాన్ని కొబ్బరికాయ గా, నెయ్యిని ఆత్మగా భావించి జీవాత్మను పరమాత్మకు అర్చన చేసే పవిత్ర ప్రక్రియగా ఈ ఇరుముడికి ప్రత్యేకత ఉంది.

శబరిమలై యాత్రలో దర్శనీయ స్థలాలు...
-అయ్యప్ప భక్తులు వీలును బట్టి అచ్చన్‌ కోవిల్‌, అరయంగావు, కుళుత్తుపులలో ఉండే అయ్యప్ప దేవస్థానాన్ని దర్శించి పందళ రాజ నివాస స్థలం చూసి ఎరుమేలి చేరుతారు.

ఎరుమేలి...
శ్రీ అయ్యప్ప స్వామి ఆప్తమిత్రుడు, సేవకుడైన వావరుస్వామి వెలసి ఉన్న దివ్య స్థలం ఇది. దీ నినే ‘కొట్టైప్పడి’ అని కూడా పిలుస్తారు. మణి కంఠునిచే సంహరింపబడ్డ మహిషి... తల మొండెం నుండి వేరు చేయబడి ఇక్కడకు విసి రివేయబడింది కాబట్టి ఈ ప్రాంతానికి ‘ఎరు మ’ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఎరుమ ‘ఎరుమేలి’గా మారింది.

ఎరుమేలి చేరిన భక్తులు వయోభేదాన్ని లెక్కించకుండా ఎంతో సంతోషంగా తమ శరీరాలను ఆకులు, కూరగాయలు, పళ్లు, రంగు రంగుల కుంకుమలు, బుడగలతో అలంకరించుకుంటారు. చెక్కతో చేయబడిన చాకు, బాకు, బాణం, గద మొదలైన ఆయుధాలను ధరించి బాజాభజంత్రీలతో ఊరేగింపుగా ‘స్వామి దింతకతోమ్‌... అయ్య ప్ప దింతకతోమ్‌’ అంటూ నాట్యం చేస్తారు. ఈ నాట్యాన్ని ‘పేటైతులాలు’ నాట్యం అంటా రు. యుద్ధ సమయంలో స్వామి మహిషిపైకి ఎక్కి ఈ నాట్యం చేశాడని భక్తుల నమ్మకం. దానికి గుర్తుగా భక్తులు ఈ న్యాటాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. నాట్యం చేసుకుంటూ స్వామి వారి భక్తుడైన వావరు స్వామిని మొదటగా దర్శించుకుని అక్కడ విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

వావరు స్వామి ముస్లిం భక్తుడైనా అయ్యప్ప స్వాములు తమ యాత్రలో కుల, మత భేదాన్ని పాటించరు. వావరు స్వామి ఆలయం నుంచి ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్ప (పేటశాస్తా) ఆలయాన్ని దర్శించుకుని తావళం చేరుకుంటారు. అక్కడి స్నాన ఘట్టాల్లో స్నాన మాచరిస్తారు. పెరియా పాదం (పెద్ద పాదం) నడిచే అయ్యప్ప స్వాములు ఇక్కడి నుంచే తల పై ఇరుముడిని ఎత్తుకుని శరణాలు పలుకు తూ పెరియా పాదయాత్రను ప్రారంభిస్తారు. చిన్న పాదం నడిచే భక్తులు వాహనాల ద్వారా పంబాకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన సన్నిధానానికి చేరుకుంటారు.

పెరూర్‌తోడు...
ఎరుమలై నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించి ‘పెరూర్‌ తోడు’ చేరతారు. ఇక్కడ చిన్నవాగు దారికి అడ్డంగా ప్రవహిస్తుంది. వీర మణికంఠుడు పులి పాల కోసం వనవాసం చేసే సమయంలో ఇక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లు భక్తులు నమ్ముతారు. పెరూర్‌ తోడు నుంచి ముందుకు ఉన్న అడవి ప్రదే శాన్ని ‘పూంగా’ వనమని అంటారు. పూంగా వనమంటే పూలతోట అని అర్థం.

కాళైకట్టి...
  • Walk way .
భక్తులు పెరూర్‌తోడు దాటి 12 కిలోమీటర్లు అడవి ద్వారా కొండలెక్కి నడిచి కాళైకట్టి చేరుతారు. మణికంఠుడు మహిషి పైకి ఎక్కి చేసిన నృత్యాన్ని చూడటానికి వచ్చి ఈశ్వరుడు తన వాహనమైన నందిని ఇక్కడ కట్టాడని అందుచేత ఈ స్థలానికి ‘కాళైకట్టి’ అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు.

ఆళుదా నది...
కాళైకట్టి దాటి 5 కిలో మీటర్లు నడిచి ఆళుదా నది చేరుతారు. ఇది పంపానదికి సమానమైన పుణ్య నది. చక్కని ప్రకృతి, సంతోషం కలిగిం చే పరిసరాలు, గలగలమని సాగే నిర్మల నీటి ప్రవాహంతో యాత్రికులకు మనోహరం కలి గించే ప్రదేశం. భక్తులు తొలి మజిలీగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం ఆళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో చిన్న రాయిని తీసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తారు.

ఆళుదామేడు...
-ఆళుదానది నుంచి ప్రారంభమైన కొండను ఆళుదామేడు అంటారు. ఇది చాలా ఎతె్తైన ఏట
వాలు కొండ. ఈ కొండను ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. కాలు జారితే పాతాళమే. చుట్టూ దట్టమైన అడవిలో తిరిగే మృగాలను చూడవచ్చు. భక్తులు శరణాలు ప లుకుతూ, ఆ స్వామి అండతో ఈ కొండను ఎ క్కుతారు. ఆళుదామేడు శిఖరం సముద్ర మ ట్టం నుంచి 4 వేల అడుగుల ఎత్తులో ఉండ టం చేత వాతావరణం చల్లగా ఉంటుంది.

కరిమలై...
కరిమలై తూడు దాటిన భక్తులు కరిమల కొం డ ఎక్కడం ప్రారంభిస్తారు. కరిమల ఎక్కడం కష్టం.. కష్టం అని మనం అయ్యప్ప భక్తి గీతా లలో వింటూ వుంటాం. దానిని బట్టి కరిమల ఎక్కడం ఎంత శ్రమతో కూడుకున్నదో ఊహిం చవచ్చు. అయ్యప్ప స్వాములు 41 రోజులు కఠోర దీక్ష చేయడం వల్ల సంపాదించిన శక్తి ఈ కొండ ఎక్కడానికి ఉపయోగపడుతుంది. శ్రీ అయ్యప్ప కృప ఉంటే తప్ప ఈ కొండను దాటడం అసాధ్యం. కరిమలై అంటే కరి (ఏను గుల) కొండ అని అర్థం. మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా సూర్య కిరణాలు భూమిపై పడనంత దట్టమైన అటవీ ప్రాంతం.

ఇక్కడ శ్రీ గంధం, ఎర్ర చందనం చెట్లు విస్తారంగా ఉం టాయి. ఇక్కడ ఏనుగు, పులి, చిరుతపులి మొ దలైన అడవి జంతువులు కనిపిస్తాయి. కరిమ లై కొండ మీద ఒక బావి ఉంది. శ్రీ అయ్యప్ప స్వామి తన భక్తుల నీటి అవసరాన్ని తీర్చడానికి బాణం వేసి ఈ బావిని నిర్మించాడని ప్రతీతి. ఈ బావి ఎప్పుడూ నీటితో కళకళలాడుతుంది. కరిమలై వంకర టింకరలతో కూడిన కాలిబా టలో ఏడు భాగాలుగా పైకి ఎక్కాలి. కరిమలై లో కరిమల నాథస్వామి, కరిమలై అమ్మన్‌ పేర్లతో ఆలయాలు ఉన్నాయి. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష సరిగా చేయకున్నా, భక్తితో శరణా లు పలుకకున్నా ఈ అమ్మవారు భక్తులను దం డిస్తుందంటారు.

సిరియాన వట్టమ్‌.. పెరియాన వట్టమ్‌..
భక్తులు కరిమల దిగిన తర్వాత సిరియాన వట్టమ్‌ (చిన్న ఏనుగు పాదం) పెరియాన వట్ట మ్‌ (పెద్ద ఏనుగుల పాదం) ద్వారా తమ యా త్రను ముందుకు సాగిస్తారు. ఇక్కడ ఏనుగు లు తిరుగుతూ వుంటాయి కనుక ఈ ప్రదేశాని కి ఆ పేర్లు వచ్చాయి. ఇక్కడ నుంచి 3 కి.మీ. పయనిస్తే పంబానదికి చేరుకుంటారు.

పంబానది...
పంబానది గంగానదితో సమానమైన పరమ పవిత్రమైన స్నాన ఘట్టం. పంబానదికి ఎడమ పక్క వాలి చేత తరుమబడ్డ సుగ్రీవుడు తన అ నుచరులతో తల దాచుకున్న పురాణ ప్రసిద్ధ మైన ముకాచలం ఉంది. రామభక్తుడైన హను మంతుడు పుట్టినది, భక్త శబరి రామ దర్శనా నికి వేచి ఉన్నది ఇక్కడే. సీతాన్వేషణ చేస్తున్న శ్రీరామ లక్ష్మణులను హనుమంతుడు మొదటి సారిగా కలుసుకున్న ప్రాంతమిది. సీతను ఎ త్తుకుపోతున్న రావణుడితో శక్తి ఉన్నంత వర కు పోరాడిన జటాయువుకు శ్రీరాముడు అగ్ని సంస్కారాలు చేసి తర్పణాలు వదిలింది ఇక్కడే.

మాతంగ మహాముని ఆశ్రమం ఉండేది ఇక్కడ నే. అందుచేతనే గంగానదితో సమానంగా పం బా నదిని భావిస్తూ తమ పితృ దేవతలకు అక్క డ తర్పణాలు విడిచి పెడతారు. చాలామంది భక్తులు పంబానదిలో దీపాలను వెలిగించి దీపోత్సవం చేస్తారు. పంబానదిలో స్నానం చేసిన భక్తులకు అనిర్వచనీయమైన అనందం కలిగి యాత్రలో అంతసేపు తాము పడ్డ శ్రమ ను మరిచిపోతారు. ఇది అయ్యప్ప భక్తులందరి కీ అనుభవపూర్వకమైనది. ఇరుముడి వెనుక ముడిలోని ఆహార పదార్థాలను ఉపయోగించి భక్తులు ఇక్కడ వంట చేసుకుంటారు. దీనినే ‘పంబాసద్దె’ అని అంటారు. పంబా తీరాన బస చేసి ఆహారం తయారు చేసి ఆర్పబడిన 108 పొయ్యిలలోని బూడిదను సేకరించి దానికి వస్తక్రాయం చేసి ఇరుముడిలో తాము తెచ్చిన విభూతితో కలిపి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు.

గణపతి సన్నిధానం...
  • -పంబా నదిలో స్నానం చేసిన భక్తులు తమ ఇరుముడులను తలపైనెత్తుకుని పంబానది తీ రం నుంచి మెట్ట మీదుగా గణపతి సన్నిధానం చేరుతారు. అక్కడ మెట్లు ఎక్కే భక్తులను ఆ జ న ప్రవాహాన్ని చూస్తుంటే హృదయం పులకి స్తుంది. కడలి తరంగాల వలే కదిలేటి జనులు అనే అయ్యప్ప భక్తి గీతం జ్ఞప్తికి వస్తుంది. గణ పతి పాదం చేరిన భక్తులు గణపతికి కొబ్బరికా య కొట్టి గణపతిని, శ్రీరాముడు, హను మంతుడు, దేవీ ఆలయాలను దర్శిస్తారు.-Bath in river

శబరి పీఠం...
-అప్పాచ్చిమేడు దాటి ప్రయాణిస్తే చిన్న గుడి కనబడుతుంది. ఇది శ్రీరాముడు శబరిని కలి సిన చోటు. శ్రీ రాముడిని సమగుణుడుగా ప్రీ తించిన కారణంగా శబరికి ఆ జన్మలో మోక్షం కలగలేదు. ఇంకో జన్మలో తపస్వినిగా పుట్టిన అమెకు శ్రీ ధర్మశాస్తా మోక్షాన్ని కలుగజేశాడు. శబరి జ్ఞాపకార్థం ఇప్పుడొక రాయి మాత్రమే ఇక్కడ ఉంది. శబరిని తలచుకుని భక్తులిక్కడ కొబ్బరికాయ కొడతారు. శరణాలు చెబుతారు.

శరంగుత్తి...
శబరిపీఠం నుండి కొంచెం ముందుకు వెళితే శరంగుత్తి చేరవచ్చు. శ్రీ అయ్యప్ప స్వామి, ఆ యన పరివారం ఇక్కడ గల శరంగ చెట్టు (మ ర్రిచెట్టు)కు తమ ధనుర్భాణాలను గుచ్చినట్లు పురాణగాథ. కన్నె స్వాములు తాము ఎరుమేలి లో కొన్న బాణాలను ఇక్కడ గుచ్చుతారు. అ ప్పుడే వారు పదునెట్టాంబడి ఎక్కడానికి అర్హులు.

పదునెట్టాంబడి...
పరిసరాలను చూస్తూ వరుసలో నిల్చున్న భ క్తులు మొదట దేవస్థానం వారు కట్టించిన విరి క్యూలైన్లలో నడిచిన తర్వాత పదునెట్టాంబడి చేరతారు. మెట్ట మార్గంలో కింద నున్న వెలి యకడుత్త స్వామి, కరూపమ్మ కరూత్త స్వాము లకు నమస్కరించి పక్కగానున్న గోడకు కొబ్బ రి కాయ కొట్టి శరణాలు పలుకుతూ మెట్టకు మొక్కుతూ ఆనందోత్సాహలతో పదునెట్టాంబ డి ఎక్కుతారు. భక్తులు ఈ పదునెట్టాంబడిని దేవతలకు ప్రతి రూపాలుగా భావిస్తారు.

ధ్వజ స్తంభం...
-పదునెట్టాంబడి దాటగానే ఎదురుగా ధ్వజస్తం భం కనబడుతుంది. ఇది పూర్తిగా బంగారు రే కులతో అతికించబడి ఉంది. ధ్వజ స్తంభం చి వరన బాణం గుర్తు ఉంటుంది. మణికంఠుడు పందళరాజుకు యోగ దృష్టితో ఆలయ నిర్మా ణానికి స్థలం చూపించిన బాణానికి గుర్తుగా భ క్తులు నమ్ముతారు. సూర్య కిరణాలు ఈ ధ్వజ స్తంభంపై పడి స్వర్ణ కాంతులు విరజిమ్ముతాయి.

సన్నిధానం...
  • - Sabarimalai
ధ్వజ స్తంభం దాటిన తర్వాత స్వామి దర్శనా నికి కాంక్రీటు డాబాపై చుట్టూ క్యూ లో ఒక ప్రదక్షిణ చేయాలి. అప్పుడు స్వామి సన్నిధానంలో నిలిచే అదృ ష్టం కలుగుతుంది. పున్నమి నాటి చం ద్రుని ముఖారవిందంతో, యోగాసన ధారియై తపస్సు చేస్తున్న భంగి మలో ఉన్న శ్రీ ధర్మశాస్తా దర్శనం చేసుకున్న భక్తుల ఆనందం వర్ణణాతీతం.

శబరిమలైలో ముఖ్య సేవలు...
స్వామి సన్నిధానంలో నవంబర్‌ 16 లేక 17 తేదీలలో ప్రారంభమై 41 రోజులు డి సెంబర్‌ 26 లేక 27 తేదీల వరకు మండల ఉత్సవం జరుగుతుంది. దీనికి మొదలు పదు నెట్టాంబడికి పూజలు చేస్తారు. పడి పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. మకర సంక్ర మణ ఉత్సవం జనవరి 1 నుంచి 20 వరకు జరు గుతుంది. ఆగస్టు - సెప్టెంబర్‌ మాసంలో వచ్చే ఓనమ్‌ ఉత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహి స్తారు. ఏప్రిల్‌లో విషు పూజ జరుపుతారు.

స్వామి వారి తిరువాభరణాలు...
  • makharajyoti darsanam
మకర జ్యోతి కనిపించే ముందు స్వామి వారి కి తిరువాభరణాలు అలంకరించడం సంప్రదా యంగా వస్తోంది. మూడు అలంకృతమైన పెట్టెలలో వజ్ర కిరీటం, బంగారు కడియాలు, స్వామి ఖడ్గంతో పాటు అనేక వజ్ర వైఢూర్యా లు ఉంటాయి. పందళ రాజవంశం వారి ఆధీ నంలోనే ఈ అమూల్యమైన అభరణాలు ఉం టాయి. మకర సంక్రాంతికి రెండు రోజుల ముందుగా పందళ రాజ వంశీయులు దేవ స్థానం బోర్డు అధికారులకు తిరువాభరణాలు అప్పగిస్తారు. ఈ అభరణాలు మొదట శబరి మలైకి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంద ళలోని వెలియ కోయికెల్‌ ధర్మశాస్తా ఆలయం లో ఉంచి పూజలు చేస్తారు.

మకర విళక్కు ఉత్సవం...
-మకర జ్యోతి కనిపించిన రాత్రి సన్నిధానంలో మకర విళక్కు ఉత్సవం జరుగుతుంది. ఈ ఉ త్సవం ప్రారంభం నుంచి ఏడు రోజుల పాటు చేస్తారు. మణి మండపంలో పులి స్వారీ చేస్తు న్న శ్రీ స్వామి అయ్యప్ప తైల వర్ణ చిత్రాన్ని ఉంచుతారు. ఇక్కడ నుంచి మాళిగ పురత్తమ్మ ను ఏనుగుపై కూర్చోబెట్టి పదునెట్టాంబడి వర కు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఊరేగిం పు పొడవునా దీపాల బారు, తాళ వాద్యాల హోరు చూసే వారికి చూడ ముచ్చటగా ఉం టుంది. పురాతన కాలం నుంచి సంప్రదాయ బద్దంగా వస్తున్న మకరవిళక్కు ఉత్సవాన్ని చూసిన తర్వాతే సన్నిధానాన్ని భక్తులు వదలాలనే నియమం ఉంది.

శబరి యాత్ర - ముఖ్యమైన రోజులు...
సాధారణంగా శబరి యాత్రికులు 3 ముఖ్య రోజులలో శ్రీ అయ్యప్ప స్వామిని దర్శింకునేం దుకు ఇష్టపడతారు.
విషుపూజ:ఇది శ్రీ స్వామి వారి పుట్టిన రోజు. ఇది మళయాళ సంవత్సరాది రోజున, సాధార ణంగా ఏప్రిల్‌ నెలలో వస్తుంది. విషు పూజకు స్థానికులైన మళయాళీలే ఎక్కువగా వెళ్తారు.

మండల పూజ: ఇది శబరిమలై యాత్రలో ము ఖ్యమైనది. ఈ యాత్ర చేసేవారు కార్తీక మా సం, మొదటి రోజున మాలధారణ చేస్తారు. 41 రోజులు మండల దీక్షను భక్తిశ్రద్ధలతో ఆచరించి మార్గశిర మాసం 15 రోజు నాటికి శబరిగిరిని చేరతారు. అప్పటికి శబరిమలైలో దేవస్థానం వారు పదునెట్టాంబడి పూజ చేసి భక్తులు 18 మెట్లను సిద్ధం చేసి ఉంచుతారు. మండల పూజకు సాధారణంగా నవంబర్‌ 16 లేక 17 తేదీల్లో దేవస్థానం తెరిచి 41 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుపుతారు.

మకర జ్యోతి...
మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది అయ్య ప్ప భక్తులు తమ ఇష్టదైవాన్ని, జ్యోతి స్వరూపు నిగా కనులారగాంచి, పులకించి, పరవశించే రోజు. ఆ రోజు సాయంకాలం పందళ రాజ వం శీయులు తెచ్చిన తిరువాభరణాలను స్వామి వారికి అలంకరించి దీపారాధన చేసిన వెంటనే భక్తులు సన్నిధానం ముందు ఉన్న కాంతి మలై (పొన్నంబల మేడు) వైపుకు చూస్తుంటారు. సాయంకాలం సుమారు 6.45 గంటలకు భక్తుల కు 3 సార్లు జ్యోతి దర్శనం కలుగుతుంది.

Courtesy with - చీటి శ్రీనివాసరావు,--మేజర్‌న్యూస్‌, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లా@ఆదివారం 14, 2013 Surya Telugu daily news paper

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Kalabhairava Temple-isannapalli(Nijamabad dist), కాలభైరవుడు ఆలయం-ఇసన్నపల్లి(నిజామాబాద్‌ జిల్లా)

  •  
  •  


మనిషిలోని 'నేను' అనే అహంకారానికి బ్రహ్మ అని పేరు. కాలభైరవతత్వం ఈ అహంకారాన్ని పోగొడుతుంది. అలా బ్రహ్మదేవుడి అహంకారాన్ని భంగం చేసినవాడు కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నిజామాబాద్‌లో ఓ పేద్ద ఆలయం ఉంది.-ఎనిమిది అడుగుల కాలభైరవుడు
కాలభైరవుడు శివుడి నుంచి ఉద్భవించినవాడు. నా అంతవాడు లేడని విర్రవీగకూడదని కాలభైరవుడి కథ చెబుతుంది. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడికి వెుదట అయిదు తలలుండేవట. తను సృష్టికర్త కూడా కావడంతో బ్రహ్మలో గర్వం ప్రవేశించిందట. త్రిమూర్తుల్లో తానే అధికుడనని చెప్పుకోవడం వెుదలుపెట్టాడట. అప్పుడు శ్రీమహావిష్ణువు వచ్చి 'నా నాభికమలం నుంచి పుట్టినవాడివి, అందువల్ల నేనే గొప్పవాణ్ణి' అన్నాడట.

వాళ్లిద్దరూ తమలో ఎవరు గొప్పో చెప్పమని నాలుగు వేదాలనూ పిలిచారట. అవి... ఇద్దరూ కాదు, పరమశివుడని చెప్పాయట. తరవాత వాళ్లిద్దరూ ప్రణవాన్ని (ఓంకారం) అడిగారు. అదీ శివుడే అధికుడని చెప్పిందట.

అప్పుడు పేద్ద జ్యోతిస్తంభం వాళ్ల ఎదుట ప్రత్యక్షమైంది. దాన్లోంచి వచ్చిన జ్యోతిని చూసి శ్రీహరి తన వాదన విరమించుకున్నాడట. కానీ, బ్రహ్మకు మాత్రం ఇంకా అహంకారం పోలేదు. అప్పుడు శివుడి నుంచి ఓ ఘోరరూపం ఆవిర్భవించిందట. 'నాలాగే తనకూ అయిదు తలలున్నాయి కాబట్టి నాతో సమానుడని గర్వంతో విర్రవీగుతున్నాడు. ఆ అయిదో తలను నీ కొనగోటితో తుంచెయ్‌' అని ఆ రూపాన్ని ఆదేశించాడట. కొనగోటితో బ్రహ్మ అయిదో తలను తెంచేసింది ఆ రూపం. అప్పటికిగానీ బ్రహ్మకు తత్వం బోధపడలేదు. అప్పుడు శివుడు ఆ రూపంతో 'నువ్వు బ్రహ్మ తలను కూడా తెంచావు కాబట్టి కాలం వలె కనిపిస్తున్నావు. అందుకే నిన్ను కాలభైరవుడు అని పిలుస్తారు. కానీ, బ్రహ్మ తల తెంచినందువల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అందువల్ల ఈ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండేళ్లు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారమవుతుంది. ఇకపై నా దేవాలయాల్లో నువ్వే క్షేత్రపాలకుడివి. కాశీపట్టణానికీ అధిపతివి. నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు' అని చెప్పాడట.

ఈ కాలభైరవుడితో సహా అష్టభైరవుల ప్రస్తావన వామన, బ్రహ్మవైవర్త వంటి పురాణాల్లోనూ కనిపిస్తుంది. ఈ కాలభైరవుని ఆలయాలు మనదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. నేపాల్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి మన రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలోనూ ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 55 కి.మీ.దూరంలో గల కామారెడ్డి పట్టణానికి 8 కి.మీ. దూరంలో... సదాశివనగర్‌ మండలంలోని ఇసన్నపల్లి-రామారెడ్డి గ్రామాల సరిహద్దులో ఉంది.

అతిప్రాచీన ఆలయం
క్రీ.శ. 16వ శతాబ్దంలో... కొందరు కాశీ నుంచి స్వామివారి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకొస్తున్నారు. ఆ బండి ఇసన్నపల్లి శివారుకు వచ్చేసరికి రాత్రైంది. దాంతో అక్కడే విశ్రమించారు. తరువాత ఓ భారీ శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహం నిటారుగా నిలబడిందట. ఆ ప్రదేశంలోనే ఆలయం నిర్మించారని పూర్వీకులు చెబుతారు.
ఈ ఆలయంలో శునకాన్ని వాహనంగా చేసుకున్న ఎనిమిది అడుగుల కాలభైరవస్వామి మూల విగ్రహం కనిపిస్తుంది. ఇసన్నపల్లి గ్రామారంభంలో రామారెడ్డి గ్రామానికి ఈశాన్య దిక్కులో పశ్చిమాభిముఖంగా కొలువుదీరాడు ఈ స్వామి. ఇలా ఎందుకు వెలిశాడు అనడానికి ఓ కారణం చెబుతారు స్థానికులు. ఒకప్పుడు ఈ గ్రామానికి అష్టదిక్కులలో అష్టభైరవులుండేవారట. వాళ్లు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారని చెబుతారు. వీళ్లలో ప్రధానుడే కాలభైరవుడు. మిగతా ఏడు భైరవ విగ్రహాలూ కాలగర్భంలో కనుమరుగైపోయాయి. ఈస్వామి మాత్రమే మిగిలాడు. పూర్వం అనావృష్టి ఏర్పడిన సందర్భాలలో స్వామివారి విగ్రహాన్ని భక్తులు పేడతో కొట్టేవారట. కొట్టిన పేడ తొలగిపోయేంతగా ఆ తరవాత వర్షం కురిసేదని చెబుతారు.

ఈ ఆలయం 1974లో దేవాదాయశాఖ అధీనంలోకి వెళ్లింది. 2001లో ఆలయ నిర్మాణం చేపట్టే వరకు స్వామి విగ్రహం రేకుల షెడ్డులోనే ఉండేది. భక్తులు సమర్పించిన రూ.50 లక్షల విరాళాలతో ఆలయం నిర్మించారు. మరో రూ.6 లక్షలతో దీనికి పక్కనే 2009లో శనైశ్చరాలయం నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం రూ.20 లక్షలతో గదులు నిర్మించారు. మాజీ ఎంపీ ఆలె నరేంద్ర అందించిన రూ.10 లక్షలతో భోజనశాల ఏర్పాటుచేశారు. అలాగే భూదాన పథకం కింద గజం రూ.500 చొప్పున ఇప్పటివరకు రూ.5 లక్షలతో ఆలయకమిటీ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేశారు. గతేడాది జిల్లాలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన ఆలయం ఇదే.

కార్తీకమాసంలో ఇక్కడ ఘనంగా స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు వస్తారు. 'అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడకు వచ్చి వారంరోజులపాటు ఆలయ ఆవరణలోని బావినీటితో స్నానం చేసి, స్వామికి పూజలు చేస్తే ఆరోగ్యవంతులవుతారు' అంటారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్‌శర్మ.

Courtesy with - గడ్డం శ్రీనివాస్‌గౌడ్‌, నిజామాబాద్‌ డెస్క్‌@eenadu sunday magazine(Sunday, November 20, 2011)

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

Jonnawada kamakshitay Temple(Nelluru dist),జొన్నవాడ కామాక్షితాయి క్షేత్రం(శ్రీ పొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లా)

  •  
  •  

-పార్వతీదేవి ప్రతిరూపమై పరమశివుని ఇష్టసఖియై అష్టలక్ష్మిలకు అప్పచెల్లెలై భక్తుల పాలిట కల్పవల్లియై విరాజిల్లుతోంది జొన్నవాడ కామాక్షితాయి. శ్రీ పొట్టిశ్రీ రాము లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్లెం మండలం జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నానధి తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోర్కెలు ఈడేర్చు తూ భక్తుల కొంగుబంగా రంగా విరాజిల్లుతోంది.

ఆలయ ప్రాశస్థ్యం..
ప్రజాపతులలో శ్రేష్ఠుడైన శ్యప ప్రజాపతి యజ్ఞమాచరించాలని దక్షిణ భారత యాత్ర నిర్విహంచారు.పవిత్ర పినాకినీ (పెన్న) నదికి ఉత్తర దిక్కున ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి అనువైనదిగా భావించి దక్షణాగ్ని, ఆహావనియాగ్ని, ఆరస్పత్యాగ్ని అను మూడు అగ్ని కుండలాలను ఏర్పాటు చేశారు. శ్యపు ని యజ్ఞయాగానికి పర్వశించిన పరమశివుడు యజ్ఞగుండం నుండి స్వయంభుగా ఉద్భవించి నట్లు స్కందపురాణంలో చెప్పబడివుంది. అప్ప టి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధి గాంచింది.

బిందుబింబంగా అమ్మవారు
-స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన పార్వతిదేవి పతిదేవుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరింది. అక్కడ కొలువై ఉన్న స్వామి తనతో వుండమని కోరగా భర్త కోరిక మేరకు నీటిబొట్టుగా మారి శి లారూపం దాల్చింది. అనంత కాలంలో జాల ర్ల వలలో చిక్కిన అమ్మవారి శిలావిగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్టించి సేవించనారంభించా రు. నాలుగోశతాబ్దంలో హిమాలయాల్లోని కైలాసగిరికి వెళుతున్న ఆదిశంకరాచార్యులు పెన్నలో పూజలందుకుంటున్న అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరిదేవిల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లిఖార్జున స్వామి గాను పార్వతి దేవి కామాక్షితాయిగాను భక్తకో టి పూజలందుకుంటున్నారని అష్టాదశ పురా ణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటోంది.

పినాకిని తీర్థం సర్వపాపహరణం
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న జొన్నవాడ పుణ్యక్షేత్రంలో ప్రవహిస్తున్న విత్ర పినాకిని నదిలో స్నానమాచరించిన జలం సేవించిన సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ద్వారపయుగంలో ఇంద్రలోకాధిపతి అయిన దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృశపర్వుడనే రాక్షసునిచే బాధింపబడ్డాడు. అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరినఇంద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షితాయిని సేవించడంతో పునీతుడ వ్వడమేకాకుండా రాక్షసబాధల నుంచి కూడా విముక్తుడైనాడు.

త్రేతాయుగంలో కుష్ఠువ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పినాకినిలో స్నానం చేసి స్వస్తత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కవిబ్రహ్మ తిక్కన సోమ యాజి భారత గ్రంథ తెనిగీకరణను ఇక్కడి నుంచే ప్రారంభించి నట్లు చెబుతారు. పురాణ కాలం నుంచి ప్రసిద్ధిచెందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాసముని శాపానికి గురై 5 శతాబ్ధాలు పూజాపునస్కారాలకు నోచు కోలేదు. దీంతో ఆలయ ప్రాంగణం ఇసుక మేట వేసింది. 13వ శతాబ్ధంలో మనుమసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించి నట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగత మవుతుంది. 1969 ఏఫ్రిల్‌ మాసంలో అప్పటి కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖ రేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మ వారికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అప్పటి నుంచి జొన్నవాడక్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్నది.

శైవాగమ సంప్రదాయ ఉత్సవాలు ఆలయంలో శైవాగమ సంప్రదాయ రీతిలో పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపం డువగా జరగుతాయి. 9 రోజుల పాటు నిర్వ హించే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల ల నుండే గాక పొరుగు రాష్ట్రాలైన తమిళ నాడు, మహారాష్ట్ర, ఒడిషాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తు న్నారు. ఆలయ కార్య నిర్వా హణాధికారి వేగూరు రవీంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు వారణాసి వెంకట శివగంగా ప్రసాద్‌ లు కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అవివాహితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకినిలో తీర్థ మాడి మూడు రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్నప్ప దర్శనం ద్వారా కటాక్షించి కోర్కెలు ఈడేరుస్తారని భక్తుల నమ్మిక.

సంతానప్రాప్తికి కొడిముద్ద...
సంతానం లేనివారు అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిదిరోజుల పాటు దీక్షపూని ధ్వజస్తంభ ప్రసాదమైన కొడిముద్దను ఫలహారంగా స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. జిల్లా కేంద్రం నుంచి జొన్నవాడ 8 కి.మీ దూరంలో వుంది. నెల్లూరు ములుమూడి బస్టాండు నుంచి ఇరుకళల పరమేశ్వరి ఆలయం మీదుగా వెళ్లవచ్చు. లేదా వెంకటేశ్వరపురం, బుచ్చిరెడ్డిపాళెం మీదుగా చేరుకోవచ్చు.

Courtesy with - కొలవపల్లి ఓంకార్‌,-మేజర్‌న్యూస్‌, బుచ్చిరెడ్డిపాళెం-శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.@Surya Telugu daily (ఆదివారం సెప్టెంబర్‌ 18, 2011))

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

Kumbeswara Temple-Kumbakonam(Tanjavur dist),కుమ్భేశ్వరాలయం-కుంభకోణం (తంజావూర్ జిల్లా)





నిత్యాభిషేకం లేని శివలింగం-తమిళ నాడు లో కుంభకోణం తంజావూర్ జిల్లాలో ఉంది దీనిని ‘’దక్షిణ దేశపు ఆక్స్ ఫర్డ్ ‘’అని ఇంగ్లీష్ వారే కీర్తించారు .ఇక్కడి కుమ్భేశ్వరాలయం అతి ప్రాచీనమైనది .350అడుగుల పొడవు ,156అడుగుల వెడల్పు ఉన్న పెద్ద ఆలయం పది అంతస్తుల గోపురం ఇక్కడి ఒక వింత .అమ్మవారు మంగళాంబిక ..గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండం లో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుక తో కుండ చేసి  వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల  కుమ్భేశ్వరుడయ్యాడు అందుకని ఇక్కడ నిత్యాభిషెకాలు ఉండవు . సుగంధ ద్వ్రవ్యాలనే లేపనం గా పూస్తారు ఇదో విచిత్రం .  చిత్రమాసం లో సూర్య కిరణాలు లింగం పై పడటం విశేషం . విశాలమైన నట రాజ మండపానికి పెద్ద రాతి చక్రాలు అమర్చబడటం మరో వింత పన్నెండుఏళ్ళకోసారి  ఇక్కడ మాఘమాసం లో మహా మాఘం ఇక్కడి కోనేరులో జరగటం ఇంకో విశేషం . పవిత్ర నదులన్నీ ఈ కోనేటిలో ప్రవేస్వ్శిస్తాయని నమ్మకం . లక్షలాది భక్తులు వచ్చి మాఘ స్నానం చేసి స్వామిని దర్శించి వెళ్ళటం మరొక విశేషం కోనేరు విస్తీర్ణం యిరవై ఎకరాలు అందులో ఇరవై రెండు బావులు ఉండటం విశేషాలకే విశేషం .

*=================================*

* Visit my website : Dr.Seshagirirao.com

Thursday, January 16, 2014

Sri Suvarcalanjaneya swami Temple, శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం-వుయ్యూరు గ్రామం(కృష్ణ జిల్లా)




దేవాలయ చరిత్ర : సాధారణం గా ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తాన్జనేయం గానో దాసాన్జనేయం గానో వీరాన్జనేయం గానో ఎక్కువగా వుంటాయి
సువర్చల తో కూడిన ఆంజనేయ దేవాలయాలు చాలా అరుదు .అలాంటి అరుదైన శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణ జిల్లలో వుయ్యూరు మండలం లోని వుయ్యూరు గ్రామం లో రావిచెట్టు బజారు చివర పుల్లేరు కాలువకు సమీపం లో వుంది
అది గబ్బిట వారి దేవాలయం గా ప్రసిధి చెందింది
ఆ ఆలయాన్ని మా తండ్రి గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి మాతా మహులు ఆంటే మా నాయనమ్మ నాగమ్మ గారి తండ్రి గారు గుండు లక్ష్మీ నరసిమ్హావధానులు గారు సుమారు రెండు వందల సంవత్చరాల క్రితం స్వంత ఖర్చులతో ఆ దేవాలయాన్ని నిర్మించి ,ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేసారు .వుత్శవ మూర్తులను కూడా ఏర్పాటు చేసి ధ్వజ స్థంభ ప్రతిష్ట చేసారు
.వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం నాడు శ్రీ హనుమజ్జయంతిని సువర్చలాన్జనేయ కల్యాణాన్ని చాల వైభవం గా జరిపే వారట .కోరిన కోరికలను తీర్చే దైవం స్వామి అందరికి అండగా వుండేవారు ఆవరణ లో ఈశాన్య భాగాన ఎత్తైన కళ్యాణ మండపం వుండేది .అర్చక స్వాములు శ్రద్ధగా స్వామి సేవ చేస్తూ తరించేవారు .నరసిమ్హావదానుల మరణం తర్వాత వారి దౌహిత్రుడి గా మా నాన్న గారు  వంశ పారంపర్య ధర్మ కర్తగా వున్నారు ..కార్యక్రమాలన్నీ బాగానే జరిగేవి
ఆలయం బాగా ముందుకు వుండటం వ్వేనుక ఖాళీ ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ మంది కి దర్శన భాగ్యం కష్టం గా వుండేది .కళ్యాణం ,జయంతి తప్పక జరిగేవి .రోడ్డు ఎట్టు పెరగటం ఆలయం లోతుగా వుండటం వల్ల వర్షా కాలమ్ నీరంతా లోపలి చేరి చాల ఇబ్బందిగా వుండేది
1961 లో మా తండ్రి గారి నిర్యాణం తరువాత నేను వంశ పారంపర్య ధర్మ కర్త  గా ఉంటున్నాను .ఆలయం శిధిలమై పోతోంది ,ఇరుకు గా కూడా వుండటం కూడా బాధాకరం గా వుండేది ఎన్నో సార్లు మంచి ఆలయాన్ని అక్కడే నిర్మించాలని అనుకున్నాము మా ఒక్కరి వల్ల ఆయె పనికాదు అందరి సహకారం కావాలి ప్రయత్నం చేసాం ..కని స్వామి అనుగ్రహం లేనిది ఏపనీ కాదు
                       ఇంతలో ఆ రోడ్ చివర వంతెన నిర్మాణం అయింది .అప్పుడు మకుటుంబ,సభ్యులకు శ్రేయోభిలాషులకు గ్రామస్తులకు బలీయమైన ఆలోచనా కలిగి స్వామి ఆశీర్వాదబలం తోడై ఒక కమిటీ గా ఏర్పడి ఆలయ నిర్మాణం చేయాలని ద్రుఢమైన సంకల్పం కలిగింది .వరుసగా సమావేశాలు జరపటం చందాలు వసూలు చేయటం వసూలైన ధనాన్ని బ్యాంకు లో వేయటం రసీదులు ఇవ్వటం చేసాము .దీనికి నాకు పూర్తి సహకారాన్ని అందించిన వారు స్వర్గీయ మండా వీరభద్ర రావు ,సంజీవరావు ,.కాలికి బలపం కట్టుకొని మేము ముగ్గురం తిరిగాము ,.మంచి సహకారం లభించింది .ధనం పోగాయింది స్వచ్చందం గా ముందుకు వచ్చి ధనం అందించారు
శ్రీ సుబ్బారావు గారు నిర్మాణ పర్య వేక్షణ చేసారు .స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్చర నిజ జ్యేష్ట నవమీ గురూ వారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరామః యందు అనగా 23 -06 -1988  న స్వామి వారి పునః ప్రతిష్ట కార్యక్రమం వైఖానస ఆగమ విధానం లో శ్రీ వేదాంతం శ్రీ రామా చార్యుల వారి ఆధ్వర్యం లో నేను నా భార్య ప్రభావతి దంపతులం స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట చేసాము
.ఆ నాటి కే.సి పీ ప్లాంట్ మేనేజర్ స్వర్గీయ ఇంజేటి జగన్నాధరావు గారు శాసన సభ్యులు స్వర్గీయ అన్నే బాబూరావు గారు ముఖ్యులుగా విచ్చేసి కార్యక్రమానికి ఘనత చేకూర్చారు కే.సి పీ వారి వదాన్యత వుయ్యూరు ,చుట్టుపక్కల గ్రామస్తుల దాతృత్వం సహాయం మరువలేము పువ్వాడ వారు వెంట్రాప్రగడ వారు ఊర వారు చోడవరపు వారు మండా వారు ఒకరేమిటి అందరు పెద్ద మనసు తో ఈ పవిత్ర భగవత్ కార్యానికి  సహకరించారు వుత్శవ విగ్రహాలు తో ఆలయం శోభిల్లింది ఉచితం గా ఇసుక తోలారు కొందరు సిమెంట్ ,ఇచ్చారు కొందరు    స్వామి మీద వున్న అచంచల విశ్వాసమేఇంత  పని మా అందరితో చేయించింది .మా కుటుంబ సభ్యులు ధనం తో సేవతో సహకరించారు ..అదొక పండగ గా జరిగింది
                         ఇంత వున్న ధన లోపం వల్ల ధ్వజ స్థంభ నిర్మాణం చేయ లేక పోయాం .అయితె ప్రతి సంవత్షరం హనుమజ్జయంతిని వైభవోపేతం గా చేసి స్వామి వారి కళ్యాణం చేస్తూ తరించాము .భక్తులు పెరిగారు .ధనుర్మాస కార్య క్రమాలు ప్రారంభించాము .హనుమద్వ్రతం ప్రతి సంవత్చరం జరుపుతున్నాం. .చైనా వోగిరాల వాస్తవ్యులు ,వదాన్యులు స్వర్గీయ పాలడుగు నాగేశ్వర దాసు గారు ధ్వజస్తంభాన్ని ప్రదానం చేసారు స్వస్తీస్రే చాంద్రమాన శ్రీ ముఖ నామ సంవత్చర జ్యేష్ట బహుళ నవమి 13 -06 -93 ఆదివారం ఉదయం 07 -29  గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున ల్లగ్న పుష్కరాసము లో ధ్వజ ప్రతిష్టా మహోత్స్చావం అత్యంత వైభవం గా జరిగింది .శ్రీ దొడ్డ వెంకట రత్నం దంపతులు శ్రీ పరాశరం రామ కృష్ణ మాచార్యుల వారి ఆధ్వర్యం లో ధ్వజ ప్రతిష్ట జరిపారు .ఎందరో వదాన్యులు సహకరించారు .ఇత్తడి తొడుగు కూడా వేయించాము. మండా వీరభద్ర రావు సంజీవ రావు గారల,అవిశ్రాంత కృషి  అనుక్షణ పర్యవేక్షణ నాకు కొండంత బలం .వారి సేవలు మరువ లేనివి .
                             నిత్యం వందలాది భక్తులు శ్రీ సువర్చలన్జనేయ స్వామి వార్లను సేవించి తరిస్తున్నారు తమల పాకుల పూజ ,పండ్లతో పూజ గంధ శింధురం తో అర్చనా విసేసం గా జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు వేలాది మంది ప్రదఖినలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి .భోగి నాడు శాంతి కల్యాణం జరుగుతుంది ఊరేగింపు చేస్తాము ఒంటె వాహనం మీద .లాడ్డులతో ప్రత్యెక పూజ కాయ గురాలతో విశేష అర్చన చూడ ముచ్చటగా వుంటుంది భజనలు హనుమాన్ చాలీసా పారాయణ ,విష్ణు ,లలితా పారాయణ సాముహిక కుంకుమ పూజ యే ఆలయం ప్రత్యేకత మాన్యు సూక్తం తో స్వామి వారికి అభిషేకం జరుగ్గుతుంది
                                మూడు సంవత్శరాల క్రితం పదకొండు రోజులు ప్రత్యెక కార్యక్రమం నిర్వహించాము,ఆలయం పునర్నిర్మించి ఇరవై ఏళ్ళు అవుతున్న సందర్భం గా .ప్రతిరోజూ ఉదయం మన్యుసుక్తంతో స్వామి వారికి అభిషేకం హోమం సహస్రనామార్చన సాయంత్రం మళ్ళీ హోమంశాంతి   కల్యాణం ..అపూర్వ స్పందన లభించింది శ్రీ స్వర్ణ నాగేశ్వర రావు గారి నేతృత్వం లో ,ఏలూరు వెద పండిట్ల ఆధ్వర్యం లో మహత్తరం గా పదకొండు రోజుల కార్య క్రమాలు జరిగాయి .మంచి సహకారం లభించింది రోజు మా దంపతుల తో పాటు ఒకరిద్దరు దంపతులు కుర్చుని స్వామి వార్ల కల్యాణం చేయటటం మహద్భాగ్యం గా భక్తులు భావించారు ఆలయం లో భక్తులు అన్ని సౌకర్యాలు కల్గించా టానికి సహకరిస్తున్నారు
                         ఈ విధం గా వుయ్యూరు లోని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ధర్మ కర్తగా స్వామి సేవలో నా జీవితాన్ని పండించుకుంటున్నాను .
                       27 -05 -11  న వైశాఖ బహుళ దశమి శుక్రవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు స్వామి వార్ల కృపా కటాక్ష ప్రాప్తి రస్తు
                                                  సర్వ్ జనః సుఖినో భవంతు .విశ్వ శాంతి రస్తు .లోక కళ్యాణ మస్తు .


Courtesy with :                                                                      మీ
                                                            గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలయ జీర్ణోద్ధరణ
————-
ధర్మ కర్త   –శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం –వుయ్యూరు

*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

Rudreswara Temple-palampet,రుద్రేశ్వరాలయం-పాలంపేట

  •  

  •  

భారత ప్రభుత్వం ఓరుగల్లును చారిత్రాత్మక నగరంగా గుర్తిం చింది. కాకతీయల పాలనా కాలం ఒక సువర్ణాధ్యాయం. ఆంధ్రదేశాన్నేకాక యావత్‌ దక్షిణభారత దేశాన్ని పరిపాలిం చిన కాకతీయులకు రాజధాని ఓరుగల్లు. వెయ్యేళ్ల ఓరుగల్లు చరిత్ర ఆనాటి శాసనాలలోనూ, సాహి త్యంలోనూ మరుగునపడి ఉంది. వారసత్వానికి ప్రధాన నిదర్శనాలైన సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రకళ వంటి అన్ని రంగాల్లో తమదైన ముద్రను కాకతీయ రాజులు వేశారు. సంస్కృతి, సుస్థిరమైన పాలన అందించి చరిత్రపుటలలో శాశ్వతమైన యశస్సును సంపాదించుకున్నారు. వారిచ్చిన సాహితీసంపద, శిల్పరీతులు, లలితకళలు నేటికీ వారి ప్రాభవానికి నిదర్శనంగా నిలిచాయి.

భారదేశంలో విరజిల్లిన అధ్బుత శిల్పరీతుల్లో కాకతీయ శిల్పరీతి ఒకటి. దేవాలయాల్లోని స్తంభాల నిర్మాణరీతి, వాటిని నిలబెట్టిన విధానం గర్భాలయ ముఖద్వారాలను బట్టి అవి కాకతీయులు కట్టించారో లేదో స్పష్టంగా చెప్పవచ్చు. కాకతీయ శిల్పరీతికి మార్గదర్శకమైనది హోయసల శిల్పరీతి. కాకతీయ దేవాలయ నిర్మాణానికి దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసలలు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాలు మీద కని ్పంచే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ దేవాలయాలలో కూడా కనిపిస్తాయి. అయితే హోయసల శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కనిపిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటి వైపుననే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాని కాకతీయుల బయటే కాకుండా లోపలి భాగంలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. హోయసల ఆలయాలపై కనిపించేవి దేవతామూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కనిపించేవి నాటి సామాన్య స్త్రీ పురుషులవి. ఆనాటి సామాన్యుల వేషధారణ, హావభావాలను ప్రదర్శించిన ఘనత కాకతీయులదేనని నిస్సం దేహంగా చెప్పవచ్చు. రుద్రేశ్వరా లయాన్ని రుద్రసేనాని శ్రీముఖనామ సంవత్సరం 1135(క్రీ.శ. 30-3-1213)లో నిర్మించినట్లు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆలయ విశేషాలు

శ్రీ రుద్రేశ్వరాలయంలోనికి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కనిపిస్తుంది. అందులో రుద్రసేనాని వంశాభివర్ణన, అతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి పరాక్రమాలు, అలనాటి ఓరుగల్లుపుర వైభవం వర్ణింపబడినాయి. ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశలలో మూడు ద్వారాలున్నాయి. ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహం ఒక కళాఖండమని చెప్పవచ్చు. ఏ దిశనుంచి చూసినా అది మననే చూసేవిధంగా ఈ నందిని రూపొందించారు. అద్భుతమైన శిల్పకళతో, అలరారుతూ మనోహరంగా, హుందాగా ఆ నంది కనిపిస్తుంది.

మదనిక శిల్పాలు

ఆలయం బయటివైపున స్తంభాలను, పై కప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలే మదనికలు. ఇవి ఆనాటి సామాన్య స్త్రీలవి. మదనిక శిల్పాలను వస్త్రాలకంటే ఆభరణాలతోనే అందంగా రూపొందించారు. అందులోనూ అప్పటి స్త్రీలు ధరించే హారాలు, శిరోభూషణాలను పొందుపరిచారు. ఒక్కో శిల్పంలో ఒక్కొక్క విశేషం కనిపిస్తుంది. ఈ శిల్పాలన్నింటిలోను కనిపించే ఆభరణాలు అలంకారాలు ఆనాటి జీవన సౌభాగ్యానికి నిదర్శనాలు. ఒక మదనిక చీరను ఒక కోతి లాగివేస్తుంటే, ఒక చేత్తో మానవసంరక్షణ చేసుకొంటూ, రెండవ చేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పంలోని ముఖకవళికలు అద్భుతం. మరొక మదనిక పాదంలో ముల్లుగుచ్చుకోగా, ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా ప్రదర్శించిన నైపుణ్యం ఆనాటి శిల్పులది.

రంగమండపం

గర్భాలయానికి ముందున్న రంగ మంటపాన్ని నిర్మించిన తీరు అమోఘం. నాలుగు స్తంభాల మీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా కనిపిస్తాయి. స్థంభం పై భాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు. స్థంభాల మధ్యలో చతురస్రకార ఫలకాలమీద, గుండ్రంగా ఉన్న భాగాలపైన వాటికి అనుగుణమైన శిల్పాలను చెక్కారు శిల్పులు.

ఒకదాని మీద సముద్ర మథనము, మరోదానిపై ముగ్గురు స్త్రీలకు నాలుగే కాళ్లున్న శిల్పం. ఒక దానిమీద పేరిణి నాట్యం. ఒక దానిమీద దండలాస్యం, కుండలాకారా నృత్యం, ఇంకోదానిపై స్త్రీలే మద్దెలలు వాయిస్తుండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్లు చెక్కిన చిత్రాలు నిజంగా అద్భుతాలే.

గర్భాలయ ప్రధానద్వారం

రుద్రేశ్వరాలయ గర్భాలయ ప్రధాన ద్వారం మరొక గొప్ప కళాఖండం. చెరుకుగడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి, రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళతో దర్శనమిస్తారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయి నుంచి లోహపు శబ్దం రావటం విశేషం. వాటి పైభా గాన సింహాల వరుసలు, లతలు, వాద్య కారుల చిత్రాలు అందంగా తీర్చిదిద్దారు.

శ్రీ రుద్రేశ్వర మహాలింగం

గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీరుద్రేశ్వర మహాలింగం చాలా గొప్పది. పానవట్టంపై భాగంలోనే కాకుండా, కింది భాగంలోనూ చెక్కిన సన్నని గీతలు శిల్పుల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

దశభుజరుద్రుడు

రంగమంటపం మధ్య భాగంలోనున్న పైకప్పులో దశభుజుడైన నాట్యరుద్రుడు అందంగా చెక్కారు. ఇలాంటి శిల్పమే హన్మకొండలోని రుద్రేశ్వరాలయం (వెయ్యి స్తంభాల గుడి)లో కూడా ఉన్నది.

పరమశివారాధకులైన కాకతీయులు వైదిక రుద్రుని ఆరాధించారనటానికి -రుద్రదేవ మహారాజు, రుద్రమదేవి, ప్రతాపకుమార రుద్రదేవమహారాజు అన్న వారి పేర్లలో కనిపించే 'రుద్ర' శబ్దమే నిదర్శనం. ఆ దశభుజ రుద్రునికి కుడివైపున ఉన్న ఐదు చేతులతో శూలము, వజ్రాయుధము, ఖడ్గము, పరశువు, అభయముద్ర ఉన్నాయి. అట్లాగే ఎడమవైపు ఉన్న ఐదు చేతులతో నాగము, పాశము, ఘంట, అగ్ని, అంకుశము ఉన్నాయి.

ప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుని 'పండితారాధ్య చరిత్ర' (వాద ప్రకరణం పు.661)లో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కనిపిస్తుంది. ఆ దశభుజరుద్రుని చుట్టూ అష్టదిక్పాలకులు భార్యాసమేతులై, తమతమ వాహనాలమీద కొలువుతీరి ఉన్నారు.

ఆ రంగమంటపం చుట్టూ ఉన్న నాలుగు అడ్డ దూలాల మీద సముద్ర మథనం, త్రిపురాసుర, గజాసుర సంహారం, వరాహమూర్తి, నాట్యగణపతి, కృత్య తదితర రూపాలను శిల్పులు మనోహరంగా చెక్కారు. ముఖ్యంగా గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మహాద్భుతం. రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పులో రకరకాల పద్మదళాలు, రాతి చక్రాలను చెక్కారు.

ప్రదక్షిణపథం

ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షిణపథం ఉన్నది. దానిమీద నడుస్తూ ఉంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కనిపిస్తాయి. వాటిలో శృంగార, క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవమూర్తులు వంటి విశేషాలు కనిపిస్తాయి.

అవేకాక మహిషాసురమర్దిని, వీరభద్రుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రేశ్వరా లయం పై భాగంలో పెద్ద గోపురం కనిపిస్తుంది. అది వేసర శిల్ప విధానంలో నిర్మింపబడినది. ఆలయ శిఖరానికి ఉపయో గించిన ఇటుకలు నీళ్లలో తేలుతాయి. ప్రస్తుతం అవి లభించటం లేదు. కాని అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం.

అటువంటి అనేక శిల్పకళా విశేషాలతో అలరారుతున్న శ్రీ రుద్రేశ్వరాలయం దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని తప్పక దర్శించితీరాల్సిందే. ఈ చారిత్రక వారసత్వ సంపదను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాక, ఓరుగల్లు ప్రజలది కూడా.

Courtesy with : ఆచార్య హరి శివకుమార్‌@apr -  Sun, 28 Apr 2013

*=================================*

* Visit my website : Dr.Seshagirirao.com

Monday, January 13, 2014

Guruvayur Temple-Trisur dist(Kerala),గురువాయూర్‌ ఆలయం-త్రిసూర్‌ జిల్లా(కేరళ)





  •  
  •  
    స్థలప్రాశస్త్యం, పవిత్రత, ప్రతిష్ఠాపిత విగ్రహం, విలక్షణవాస్తు సౌందర్యం... ఇలా ఒక్కో ఆలయం ఒక్కో కారణంవల్ల ప్రసిద్ధమవుతుంది. కానీ గురువాయూర్‌ విషయంలో ఇవన్నీ ఏకీకృతం కావడం విశేషం. భూలోక వైకుంఠంగా భక్తుల హృదయాలను దోచుకున్న ఈ ఆలయంలోకి కృష్ణాష్టమి సందర్భంగా అడుగుపెడితే...కోవెలలో అడుగుపెట్టగానే నలువైపులా రాసిన నారాయణనామం అలౌకికానందాన్ని కలిగించగా, తాదాత్మ్యంతో భక్తులు చేసే నారాయణనామ సంకీర్తనం కర్ణపేయంగా ప్రతిధ్వనిస్తుంటుంది. శంఖచక్రగదాపద్మాలను చతుర్భుజాల్లో ధరించి పుష్పమాలాలంకృతుడై కస్తూరీ తిలకాంకితుడైన చిన్నికృష్ణుని రూపాన్ని చూడగానే భక్తులు ఆనందపరవశులవుతారు. నాలుగున్నర అడుగుల ఎత్తున్న ఆ చిన్మయమూర్తిని చూసినవారి హృదయాల్లో చింత చింతాకైనా ఉండదన్నది భక్తుల నమ్మకం. ఎన్నో బాధలతో ఈ నారాయణ సన్నిధానానికి వచ్చి శరణు వేడిన వారంతా తేలికపడ్డ మనసుతో ఇంటికి వెళ్తారట. అందుకే కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో ఉన్న గురువాయూర్‌ ఆలయంవద్ద ఏడాది పొడవునా భక్తులు బారులు తీరతారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఆ నందనందనుడికి జ్యోతుల తోరణాలతో జోతలర్పించే సుందరదృశ్యం చూసి తీరాల్సిందే.

పాతాళశిల!
ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

నారాయణీయం!
గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.

భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.


అన్నప్రాశన
గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.

గజేంద్ర సేవ!
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్‌, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్‌ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్‌. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్‌ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు.

అసంఖ్యాక భక్తుల ఆదరణకు నోచుకున్న గురువాయూర్‌ దేవస్థానం వాద్యకళాశాలనీ గ్రంథాలయాన్నీ చిత్రకళాకేంద్రాన్నీ మ్యూజియంనీ వైద్య కేంద్రాన్నీ ఆయుర్వేద ఆసుపత్రినీ శ్రీకృష్ణాకాలేజీనీ స్కూలునీ చక్కగా నిర్వహిస్తూ భక్తజనులకు తన వంతుసేవల్ని అందిస్తూ భూలోక వైకుంఠంగా భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.

Courtesy with : Sunday magazine@eenadu news paper-Thursday, August  25, 2011


*=================================*

* Visit my website : Dr.Seshagirirao.com

Sunday, January 12, 2014

Second Annavaram Gudem Temmple(Adilabad dist),రెండవ అన్నవం-గూడెం దేవస్థానం(అదిలాబాద్‌ జిల్లా)




-ఏ శుభకార్యం జరిగినా మనవారు సత్యనారాయ స్వామి వ్రతం చేసుకుంటారు. అంతటి మహిమాన్వితుడైన దైవం సత్యనారాయణ స్వామి. ఆ స్వామి సర్వాంతర్యామి. గుడిలో ఉన్న ఆ స్వామి మన కంటిని కోవెలాగా చేసుకుని కూడా దివ్యదర్శనమిస్తాడు. గూడెం గ్రామంలో ఒక సామాన్యుడికి కలలో దర్శనమిచ్చాడు. తన కోవెల నిర్మాణానికి తానే దారి చూపాడా స్వామి. అదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం, గూడెం గ్రామంలో వెలసిన సత్యనారాయణ స్వామి దేవస్థానం రెండవ అన్నవరంగా ప్రసిద్ధిగాంచింది.

ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం, గూడెం గ్రామంలోని సత్యనారాయణ స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే రెండో అన్నవ రంగాపసిద్ది గాంచింది. దేవస్థానానికి సమీపం లోనే గోదావరి ప్రవహిస్తుండడంతో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి సత్యనారా యణస్వామి దర్శనం చేసుకుని తమ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతినెలా పౌర్ణ మి రోజున వేలాది మంది భక్తుల మధ్య గొప్ప జాతర జరుగుతుందక్కడ. రాష్ట్రం నలుమూల ల నుండి భక్తులు తరలివచ్చి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి స్వామి వారిని దర్శనం చేసుకోవడం పరిపాటి. రాష్ట్రంలోనే ప్రసిద్ది చెందిన సత్యనారాయణస్వామి దేవ స్థానాల్లో మొదటిది తూర్పు గోదావరి జిల్లాలో ని అన్నవరం కాగా, మరో అన్నవరంగా గూ డెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి నదీ తీరాన ఎతె్తైన గుట్ట పై వెలసిన సత్యసంకల్పుడు, వైకుంఠరాముడు అయిన శ్రీ సత్యనారాయణ స్వామిని గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్ల స్వామి ప్రతిష్ఠిం చారు. తెలంగాణలోనే ఎంతో ప్రసిద్దిగాంచిన ఈ సత్యనారాయణ స్వామి దేవ స్థానానికి ప్రతిదినం ఎందరో భక్తులు వస్తుంటారు.

క్షేత్ర మహత్మ్యం...
god338 సంవత్సరాలకు పూర్వం గూడెం గ్రామ వాసులైన గోవర్ధన పెరుమాండ్ల స్వామి అను చాత్తాద శ్రీవైష్ణవునికి శ్రీస్వామి వారు కలలో కనిపించి నేను మీ గ్రామ శివారు రాట్నపు చెవుల కొండపై వెలిశాను అని సెలవిచ్చా రట. నాకు వచ్చింది కలనేకదా అని భక్తుడైన పెరుమాండ్ల స్వామి ఆ మాటను నమ్మలేదు. కాని మళ్లీ మరుసటి రోజు స్వామి వారు కలలోకి రావటం వల్ల ఆశ్చర్యపోయిన పెరుమాండ్లు కొండపైన స్వామి వెలసిన చోటు కోసం వెతకటం ప్రారంభించాడు. ఎంత వెతికినా జాడ దొరక్క పోవడం వల్ల సాయంత్రం ఇంటికి వెళ్ళి నిద్రపోయే ముందు నీవు ఉండే జాడ తెలుసు కునేంత ఙ్ఞానం నాకు ఎక్కడుంది. స్వామి? నన్ను మన్నించి దర్శనమివ్వమని మనస్సులో తలచుకొని పడుకున్నాడు. మళ్ళీ ఆ రోజు స్వామి వారు కలలోకి వచ్చి మీకు ఎదురుగా కనబడుతున్న ఎతె్తైన కొండపై ఉన్న గుహల్లో నేను ఉన్నాను... అని చెప్పి అదృశ్యమయ్యారు.

-తెల్లవారగానే సంతోషం పట్టజాలక పెరు మాండ్ల స్వామి గుట్టపైకి ఎక్కి కలలో కనిపిం చిన గుహలో వెదికాడు. అప్పుడు గుహ లో చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. విగ్రహాన్ని ముట్టుకోకుండా ఇంటికి చేరుకున్నాడు. భక్తితో పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించిన పెరుమాండ్లు స్వామి వారి విగ్రహానికి అభిషేకాలు, పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలు తండోపతండా లుగా గుట్టపైకి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నా రు. కొన్ని రోజుల తరువాత పెరుమాండ్ల స్వామి ఆలో చించి శ్రీసత్య నారాయణ స్వామి, రమాదేవి (లక్ష్మీ) విగ్రహాలను పెద్దవి చేయించి సొంత నిధులతో ఆలయ నిర్మాణం గావించి శ్రీ క్రోధి నామ సంత్సర మాఘశుద్ధ దశమి (1964వ సంవత్సరం) నాడు విగ్రహ ప్రతిష్టాపన చేశాడు.

- గుట్టపైకి వెళ్ళేందుకు దారి, మంచి నీటి బావి తవ్వించి ఆలయానికి కొత్త శోభను చేకూర్చారు. అప్పటి నుండి అనునిత్యం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానం వినూత్న కళతో వెలుగొందుతోంది. ఒక్క తెలంగాణా లోనే కాక రాష్ట్రంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కుంకు మార్చనలు, అభిషేకం, అష్టోత్తర పూజ, హార తులు, నవగ్రహ, సహస్రనామ నిత్యాది అర్చ నలు, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహి స్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ద్వాదశి రోజున శ్రీస్వామి వారి కళ్యాణోత్సవం, హోమం, రథోత్సవం నిర్వహిస్తారు. సప్తహాభజనల రోజున గొప్ప జాతర, హోమ యఙ్ఞం జరుగుతాయి. ఈ దేవాలయం దేవాదాయశాఖ ఆధీనంలో ఉండటం వల్ల భక్తుల సౌఖర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పౌర్ణమి నాడు దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల నుండి ప్రతియేటా లక్షల్లో ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Courtesy with - ఎలుగు లింగన్న, ఆదిలాబాద్‌@surya daily news paper(ఆదివారం సెప్టెంబర్‌ 18, 2011)



*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com

Pitapuram Saktipitam(E.G.dist),శక్తిపీఠాల్లోసుప్రసిద్ధంపిఠాపురం(తూర్పు గోదావరి జిల్లా)

  •  

  •  
తూర్పు గోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో పిఠాపురం పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ధమైనది.దాక్షాయణీ దేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ. దాక్షాయణీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడటం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురంగా పేరొచ్చింది. దిన క్రమంగా పిఠాపురంగా మారింది. అష్టాదశ శక్తి పీఠాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి అమ్మవారి పేరు పురూహుతిక దేవి. పురూహుతికా దేవి ఆలయం ఎదురుగానే కుక్కుటేశ్వరస్వామి ఆలయం ఉంది. కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలోని శివలింగం స్వయంభూ శివలింగం. దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం. పిఠాపురం దేశంలోని త్రిగయ క్షేత్రాల్లో ఒకటి. గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కృప కోసం తపస్సు చేశాడు. తన దేహం పవిత్రమైనదిగా చేయాలని అతడు వరం కోరాడు. అతడి కోరిక ప్రకారం అతడి దేహంపై ఇక్కడ యజ్ఞాన్ని ఆరు రోజులు నిర్వహించారు. విష్ణువు వరం ప్రకారం అతడి పాదభాగం పిఠాపురంలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు వచ్చింది.

అలాగే, పిఠాపురం వైష్ణవ క్షేత్రం కూడా. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోసం ఐదు ప్రాంతాల్లో విష్ణాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం.ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం,ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం,పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి. పిఠాపురం సంస్థానాధీశులు ఎంతో మంది కవులను ప్రోత్సహించారు. సాంఘిక సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చారు. పిఠాపురం రాజావారి పేరిట కాకినాడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కాలం క్రితమే నెలకొల్పారు. పిఠాపురంలో క్రైస్తవ మెడికల్‌ సెంటర్‌ ఏర్పాటును పిఠాపురం రాజా ప్రోత్సహించారు. అలాగే, పిఠాపురంలో సూర్యరాయ తెలుగు నిఘంటువు రూపకల్పనకు చేయూత నిచ్చారు. పిఠాపురంలో సూర్యా ఆయుర్వేద నిలయం దశాబ్దాలుగా వైద్య సేవలను అందిస్తోంది.ఈ సంస్థ శాఖలు ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమంలో పిఠాపురానికి చెందిన ఎంతో మంది చురుకుగా పాల్గొని జైలుకి వెళ్ళారు.శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వేంచేసి ఉన్న అన్నవరం క్షేత్రం ఇక్కడికి బాగా దగ్గరే. పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్ళు అన్నీ పిఠాపురంలో ఆగుతాయి. ఇవి కాక, జిల్లా కేంద్ర మైన కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.శక్తిపీఠాల్లో ఒకటి అయిన పిఠాపురాన్ని సందర్శించడం వల్ల కుక్కుటేశ్వరస్వామి, కుంతీమాధవస్వామి ఆలయాలనే కాక, పాదగయను కూడా సందర్శించవచ్చు. పాత తరానికి చెందిన సినీ గేయరచయిత, సుప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి పిఠాపురం సమీపంలోని చంద్రంపాలెంలో పుట్టి పిఠాపురంలో విద్యాభ్యాసం చేశారు. అలాగే, మరో సుప్రసిద్ధ కవి ఆవంత్స సోమసుందర్‌, పాత తరం ఐఎన్‌టియుసి నాయకుడు భావనాచారి, వెనుకటి తరానికి చెందిన సినీ నేపధ్య గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖులు ఈ పట్టణానికి చెందినవారే.పిఠాపురం నాగేశ్వరరావు ఊరుపేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ప్రాచుర్యాన్ని పొందారు. సాహిత్య, సాంస్కృతిక,విద్యా, కళా రంగాల్లో పిఠాపురం స్వాతంత్య్రానికి పూర్వమే ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది.

Courtesy with : స్వామి అనంత apr -news paper   Mon, 5 Aug 2013,

*=================================*
 * Visit my website : Dr.Seshagirirao.comhttp://dr.seshagirirao.tripod.com/