మత్స్యగిరీంద్రుని అవతారం విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోకి ఎంతో విశిష్టమైంది. దశావతారాలకు సంబంధించిన ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ.. మత్సావతారానికి సంబంధించిన ఆలయాలు చాలా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన మత్సేంద్రుడి ఆలయమే.. కరీంనగర్ జిల్లా కొత్తగట్ట గ్రామంలో వెలసిన మత్స్య గిరీంద్రుడి దేవాలయం. మత్స్యవతారానికి సంబంధించి దేశం మొత్తంలో రెండే ఆలయాలు ఉండడం.. అవి రెండూ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. ఒకటి కరీంనగర్ జిల్లా కొత్తగట్టు మత్స్యగిరీంద్రుడు కాగా.. మరొకటి అనంతపురం జిల్లాలో ఉంది.
-కరీంనగర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో.. వరంగల్ - కరీంనగర్ ప్రధాన రహదారిలో.. కొత్తగట్టు గ్రామం వద్ద గుట్టపై వెలిశాడు. శ్రీమత్స్యగిరీంద్రస్వామి. క్రీశ 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో దేవాలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతున్నది.
మత్స్యగిరీంద్రుడి చరిత్ర...
శ్రీ మహా విష్ణువు లోక కళ్యాణర్థమై సప్త సముద్రాలలో విహారిస్తున్న సమయంలో ఆయన కునుకు తీయడంతో వేదాలు సముద్రంలో జారిపడతాయి. దాంతో రాక్షసుడు అపహరించి సముద్రం అంతర్భాగంలో దాచి పెడతాడు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని వేడుకోవడంతో మహా విష్ణువు అవతారలలో అత్యంత విశిష్ట అవతారమైన శ్రీమత్స్యగిరీంద్రస్వామి అవతారమెత్తి సముద్ర అంతర్భాగంలోనున్న వేదాలను పైకి తీసి, రక్షించి లోకాపకారం చేశాడని ప్రతీతి. అలాంటి అవతార పురుషుని అంశమే కొత్తగట్టు గ్రామంలో గుట్టపై మత్స్యగిరీంద్రునిగా వెళిశాడని ప్రతీతి. అలా ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల అభీష్టములను నెరవెర్చుతూ పూజలందు కుంటు న్నట్లు పూర్వీకుల కథనం.
-గుట్టుపై ఉన్న కోనేరులో స్నానమా చరించి స్వామివారిని దర్శిం చుకుంటే తమ పాపాలు హరించి, కోరిన కోర్కెలు నెరవెరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేగాక ఈ ప్రాంత వాసులు కోనేరులోని నీటిని పంట పొలాల్లో చల్లితే ఎలాంటి చీడపీడలు లేకుండా పంటలు బాగా పండి అధిక దిగుబడి వస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఆలయ సమీపంలో ఉన్న కోనేరు ఎప్పటికీ పోకపోవడం విశేషం. అందులో నీరు పూర్తిగా ఎన్నడూ ఇంకిపోలేదని చారిత్రక సాక్షాధారాల వల్ల తెలుస్తోంది.
మాఘ శుద్ద పౌర్ణమితో జాతర ఉత్సవాలు ప్రారంభం...
-ప్రతి ఏడాది మాఘ శుద్ద పౌర్ణమితో జాతర ఉత్సవాలు ప్రారంభమై పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల లో భాగంగా శ్రీ మత్స్యగిరీంద్రుడికి భూదేవి, నీళదేవిలతో కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం తర్వాత మరుసటి రోజు జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లాకు చెందిన ప్రజలే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు.
- - మొల్గూరి వేణుగోపాల్‌గౌడ్,-మేజర్‌న్యూస్, శంకరపట్నం@Surya daily news paper (ఆదివారం 24 జూలై 2011)
*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com
No comments:
Post a Comment